Telugu Global
Health & Life Style

భార‌తీయుల్లో పెరుగుతున్న మాన‌సిక స‌మ‌స్య‌లు 

మ‌న దేశ జ‌నాభాలో 1 నుంచి 2 శాతం మంది అంటే  సుమారు 5 కోట్ల మంది  ప్ర‌జ‌లు మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ సంఖ్య  ప్ర‌తి ఏటా పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోందని  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మాన‌సిక ఒత్తిడి, ఆదుర్దా వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు మ‌న‌దేశంలో ఐదు కోట్ల‌కు పైగా ఉన్నారు. జాతీయ ఆరోగ్య సంఘం నివేదిక  ప్ర‌కారం ఒత్తిడి, ఆదుర్దాల‌తో  గ‌త ఏడాది 7 వేల […]

మ‌న దేశ జ‌నాభాలో 1 నుంచి 2 శాతం మంది అంటే సుమారు 5 కోట్ల మంది ప్ర‌జ‌లు మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ సంఖ్య ప్ర‌తి ఏటా పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మాన‌సిక ఒత్తిడి, ఆదుర్దా వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు మ‌న‌దేశంలో ఐదు కోట్ల‌కు పైగా ఉన్నారు. జాతీయ ఆరోగ్య సంఘం నివేదిక ప్ర‌కారం ఒత్తిడి, ఆదుర్దాల‌తో గ‌త ఏడాది 7 వేల మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఆయ‌న శుక్ర‌వారం లోక్‌స‌భ‌లో వెల్ల‌డించారు. ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డానికి మాన‌సిక వైద్య నిపుణుల సంఖ్య‌ను పెంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

First Published:  24 July 2015 1:08 PM GMT
Next Story