Telugu Global
Cinema & Entertainment

బిగ్ బి దంప‌తులు మ‌ళ్లీ వ‌స్తున్నారు..?

వెండి తెర పై వారిద్ద‌రు క‌నిపిస్తే అభిమానుల‌కు అదొక సంద‌డి.  ఎన్నిచిత్రాల్లో క‌నిపిస్తే ..అభిమానుల‌కు అంత ఆనందం. అయితే బిగ్ బి, ఆయ‌న స‌తిమ‌ణి  ఈ మ‌ధ్య  క‌ల‌సి నటించిన సంద‌ర్భాలు త‌క్కువే. బాలీవుడ్ లో  క‌బీ ఖుషి క‌బీ గ‌మ్ చిత్రం త‌రువాత ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు.  ఆఫ్ కోర్స్ గంగా దేవి అనే భోజ‌పురి చిత్రంలో  న‌టించారు. ఇక లేటెస్ట్ స‌మ‌చారాం ఏమిటంటే..  ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ ఆర్ ఆర్ బాల్కీ( గ‌తంలో అమితా్బ్ తో  […]

బిగ్ బి దంప‌తులు మ‌ళ్లీ వ‌స్తున్నారు..?
X

వెండి తెర పై వారిద్ద‌రు క‌నిపిస్తే అభిమానుల‌కు అదొక సంద‌డి. ఎన్నిచిత్రాల్లో క‌నిపిస్తే ..అభిమానుల‌కు అంత ఆనందం. అయితే బిగ్ బి, ఆయ‌న స‌తిమ‌ణి ఈ మ‌ధ్య క‌ల‌సి నటించిన సంద‌ర్భాలు త‌క్కువే. బాలీవుడ్ లో క‌బీ ఖుషి క‌బీ గ‌మ్ చిత్రం త‌రువాత ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు. ఆఫ్ కోర్స్ గంగా దేవి అనే భోజ‌పురి చిత్రంలో న‌టించారు.

ఇక లేటెస్ట్ స‌మ‌చారాం ఏమిటంటే.. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ ఆర్ ఆర్ బాల్కీ( గ‌తంలో అమితా్బ్ తో చీనీ క‌మ్ అనే చిత్రం చేశారు) ఒక చిత్రం చేస్తున్నారు. ఈసినిమాలో జ‌య‌బచ్చ‌న్ ను కూడా న‌టింప‌చేస్తున్నార‌ట‌. వీరి నీజ‌జీవిత‌పు క్యారెక్ట‌ర్సే ఈ చిత్రంలో ఉండేలా క‌థ‌ను రాసుకున్నార‌ట‌. అర్జున్ క‌పూర్, క‌రీనా క‌పూర్ లీడ్ రో్ల్స్ చేస్తున్నారు. మొత్తం మీద బిగ్ బి క‌పుల్ బాలీవుడ్ ఆడియ‌న్స్ ను మ‌రోసారి ఖుషి చేయ‌నున్నార‌న్న‌మాట‌.

First Published:  25 July 2015 1:04 AM GMT
Next Story