టాలీవుడ్ లోకి ప్రియాంకా చెల్లెలు

బాలీవుడ్ లో ఇప్పటికే క్రేజీ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది ప్రియాంక చోప్రా. ఇప్పుడామె చెల్లెలు అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హిందీలో ఒకట్రెండ్ సినిమాలు కూడా చేసింది. కానీ పెద్దగా పేరుతెచ్చుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు తెలుగు చిత్రసీమపై ఫోకస్ పెట్టింది. ఆమె పేరు మన్నారా చోప్రా. ప్రియాంకాచోప్రాకు వరసకు చెల్లెలైన మన్నారా త్వరలోనే సునీల్ సినిమాలో నటించేందుకు కాల్షీట్లు కేటాయించింది. ఈమధ్య హైదరాబాద్ లో జరిగిన టీఎస్ఆర్ అవార్డు వేడుకల్లో కూడా చిందేసి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది మన్నారా చోప్రా.
 
వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడు సునీల్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మన్నారో చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రేమకథాచిత్రమ్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను నిర్మించిన సుదర్శన్ రెడ్డి, ఆర్పీఎ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. వరుస ఫ్లాపులతో ఉన్న సునీల్ తన తాజా చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. దీనికోసం మరోసారి తన సిక్స్ ప్యాక్ నే నమ్ముకున్నాడు