Telugu Global
Cinema & Entertainment

భ‌జ‌రంగ్ భాయిజాన్ స‌క్సెస్ పాయింట్ అదే..!

సినిమా అంటే వట్టి విజువ‌ల్ వండ‌రే కాదు.. మెద‌డుకు మేత‌.. మ‌నిషిని మంచి వాడి గా చేయ‌డానికి ఆలోచింప చేసే ప్ర‌య‌త్నం అయిన జ‌ర‌గాలి.   బ‌జ‌రంగ్ భాయిజాన్ లో ఆప్ర‌య‌త్నం జ‌రిగింది.  ఎమోష‌న్స్ కు రాజ‌కీయ‌లుండ‌వ‌ని చాటింది.  కాశ్మీర ప్రాంతంలో  గొర్రెలు కాసుకుని జీవించే దంప‌తుల‌కు ఒకే ఒక పాప‌. ఆరేళ్ల  వ‌య‌సు వ‌చ్చినా   పాప‌కు మాట‌లు రావు.  భార‌త‌దేశంలో  ప్ర‌సిద్ద ద‌ర్గ‌లో ప్రార్ధ‌న‌లు చేస్తే.. ఫ‌లితం వుంటుంద‌ని తెలుసుకుంటారు.  పాప తండ్రి ఆర్మీలో ప‌ని చేసి రిటైర్ అవుతాడు.  అత‌నికి  […]

భ‌జ‌రంగ్ భాయిజాన్ స‌క్సెస్ పాయింట్ అదే..!
X

సినిమా అంటే వట్టి విజువ‌ల్ వండ‌రే కాదు.. మెద‌డుకు మేత‌.. మ‌నిషిని మంచి వాడి గా చేయ‌డానికి ఆలోచింప చేసే ప్ర‌య‌త్నం అయిన జ‌ర‌గాలి. బ‌జ‌రంగ్ భాయిజాన్ లో ఆప్ర‌య‌త్నం జ‌రిగింది. ఎమోష‌న్స్ కు రాజ‌కీయ‌లుండ‌వ‌ని చాటింది. కాశ్మీర ప్రాంతంలో గొర్రెలు కాసుకుని జీవించే దంప‌తుల‌కు ఒకే ఒక పాప‌. ఆరేళ్ల వ‌య‌సు వ‌చ్చినా పాప‌కు మాట‌లు రావు. భార‌త‌దేశంలో ప్ర‌సిద్ద ద‌ర్గ‌లో ప్రార్ధ‌న‌లు చేస్తే.. ఫ‌లితం వుంటుంద‌ని తెలుసుకుంటారు. పాప తండ్రి ఆర్మీలో ప‌ని చేసి రిటైర్ అవుతాడు. అత‌నికి వీసా రాదు కాబ‌ట్టి.. త‌ల్లి గొర్రెల్ని అమ్మేసి.. రైలు లో భార‌త దేశం బ‌య‌లు దేరుతుంది. ద‌ర్గ‌లో ప్రార్ధ‌న‌లు చేసే తిరిగే వేళ్లే ట‌ప్పుడు పాప త‌ప్పి పోతుంది. ఆ పాప పవ‌న్ కుమార్ చ‌తుర్వేది అలియాస్ స‌ల్మాన్ ఖాన్ కంట ప‌డుతుంది. ఆయ‌నే అనాధాగా ఒక‌రి ద‌గ్గ‌ర జీవిస్తుంటాడు. ఆయ‌న‌కు తోడు ఈ పాప‌.. సినిమాలో అంజ‌నేయ స్వామి భ‌క్తుడైన స‌ల్మాన్ ఖాన్.. 'త‌న' నుంచి 'మ‌న’ అనే విశాల‌త‌త్వ‌పు స‌ర్కిల్' ను ఎలా చేరుకున్నాడు.

త‌న‌కు సంబంధం లేని పాప ను త‌న గూటికి చేర్చ‌డానికి ..త‌న ప్రాణ‌ల్నే ఫ‌ణంగా పెట్ట‌డానికి ఎందుకు సిద్ద ప‌డ్డాడు. అంత‌గా అత‌న్ని ముంద‌కు న‌డిపించింది ఏమిటి. ఇది టూకీగా ఈ చిత్ర క‌థ‌. క‌బీర్ స్క్రీన్ ప్లే హృద‌యానికి హ‌త్తుకుంటుంది. పాప యాక్టింగ్ గొప్ప‌గా ఉంటుంది. స‌ల్మాన్ రోల్ లో ఎక్క‌డ ఆయ‌న స్టార్ డ‌మ్ క‌నిపించిందు. ప్ర‌పంచంలో ఎంత పెద్ద స్టార్ చేసినా.. స్టార్ ను ప‌క్క‌కు నెట్టి.. క‌థ‌లో క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే ఎలివేట్ అయ్యేటంతో గొప్ప క‌థ‌.. ఇదే సినిమా స‌క్సెస్ కు బ‌లం. ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌ని స‌రిగా చూడాల్సిన చిత్రం. ఊహ తెలిసిన పిల్ల‌ల‌కు ద‌గ్గ‌రుండి చూపిస్తే ఇంకా మంచిది.

First Published:  24 July 2015 7:02 PM GMT
Next Story