Telugu Global
NEWS

జ‌యప్ర‌ద‌, మంచుల‌క్ష్మి మందుకొట్ట‌లేదు

వీకెండ్ వ‌స్తోందంటే చాలు ట్రాఫిక్ పోలీసులు నిర్వ‌హించే డ్రంక‌న్ డ్రైవ్ టెస్టులు, ఆపై కేసులు గుర్తొచ్చి మందుబాబుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తుతున్నాయి. సామాన్యుల ప‌రిస్థితేమో కానీ సెల‌బ్రెటీల బాధ మాత్రం వ‌ర్ణ‌నాతీతం. డ్రంక‌న్ డ్రైవ్ కేసులో ప‌ట్టుబ‌డిన సెల‌బ్రెటీల‌కు వ‌ద్దు మొర్రో అంటున్నా మీడియా బోలెడంత ప‌బ్లిసిటీ ఇచ్చేస్తోంది. శుక్ర‌వారం రాత్రి కూడా హైద‌రాబాద్ న‌గ‌ర ట్రాఫిక్ పోలీసులు డ్రంక‌న్ డ్రైవ్ టెస్టులు నిర్వ‌హించారు. పోలీసులు పెద్ద‌మ్మ గుడి వ‌ద్ద ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో అందాల తార […]

జ‌యప్ర‌ద‌, మంచుల‌క్ష్మి మందుకొట్ట‌లేదు
X

వీకెండ్ వ‌స్తోందంటే చాలు ట్రాఫిక్ పోలీసులు నిర్వ‌హించే డ్రంక‌న్ డ్రైవ్ టెస్టులు, ఆపై కేసులు గుర్తొచ్చి మందుబాబుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తుతున్నాయి. సామాన్యుల ప‌రిస్థితేమో కానీ సెల‌బ్రెటీల బాధ మాత్రం వ‌ర్ణ‌నాతీతం. డ్రంక‌న్ డ్రైవ్ కేసులో ప‌ట్టుబ‌డిన సెల‌బ్రెటీల‌కు వ‌ద్దు మొర్రో అంటున్నా మీడియా బోలెడంత ప‌బ్లిసిటీ ఇచ్చేస్తోంది. శుక్ర‌వారం రాత్రి కూడా హైద‌రాబాద్ న‌గ‌ర ట్రాఫిక్ పోలీసులు డ్రంక‌న్ డ్రైవ్ టెస్టులు నిర్వ‌హించారు. పోలీసులు పెద్ద‌మ్మ గుడి వ‌ద్ద ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో అందాల తార జ‌య‌ప్ర‌ద‌, మంచు ల‌క్ష్మీలు వారి వాహ‌నాల్లో వ‌చ్చారు. పోలీసులు వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వారిద్ద‌రూ తాగ‌లేద‌ని తేలింది. ఐ స‌పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ అనే కార్య‌క్ర‌మంలో మంచు ల‌క్ష్మి పాల్గొన్నారు. తాగి వాహ‌నం న‌డిపి ప్ర‌మాదాలు తెచ్చుకోవ‌ద్ద‌ని ఆమె ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

First Published:  25 July 2015 4:51 AM GMT
Next Story