Telugu Global
Cinema & Entertainment

కిక్ కోసం రాణిరుద్రమ ఇంకా వెనక్కి....

ఎన్నాళ్ల నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి కిక్-2, రుద్రమదేవి సినిమాలు. బాహుబలి సినిమా ఎఫెక్ట్ ఈ రెండు సినిమాలపై పడింది. ఇప్పుడు బాహుబలి ఊపు కాస్త తగ్గడంతో తమ సినిమాల్ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. తాజాగా ఈ రెండుసినిమాల విడుదల తేదీల్ని ప్రకటించారు. వీటిలో రవితేజ నటించిన కిక్-2 సినిమాను ఆగస్ట్ 22న విడుదల చేయాలనుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ […]

కిక్ కోసం రాణిరుద్రమ ఇంకా వెనక్కి....
X

ఎన్నాళ్ల నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి కిక్-2, రుద్రమదేవి సినిమాలు. బాహుబలి సినిమా ఎఫెక్ట్ ఈ రెండు సినిమాలపై పడింది. ఇప్పుడు బాహుబలి ఊపు కాస్త తగ్గడంతో తమ సినిమాల్ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. తాజాగా ఈ రెండుసినిమాల విడుదల తేదీల్ని ప్రకటించారు. వీటిలో రవితేజ నటించిన కిక్-2 సినిమాను ఆగస్ట్ 22న విడుదల చేయాలనుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మించాడు. అయితే కొన్ని రీషూట్ల వల్ల సినిమా మేకింగ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు కిక్-2ను వచ్చేనెల 22న విడుదల చేయాలని నిర్ణయించారు. సూపర్ హిట్టయిన కిక్ సినిమాకు రీమేక్ ఇది. అటు చారిత్రక కథాంశంతో తెరకెక్కిన రుద్రమదేవి సినిమా విడుదల తేదీ కూడా కన్ ఫర్మ్ అయింది. మొట్టమొదటి త్రీడీ హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన రుద్రమదేవి సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్. అనుష్క లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో జాప్యం వల్ల రిలీజ్ లేటైంది. మొత్తమ్మీద ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఒకేరోజు ఫైనలైజ్ కావడం విశేషం.

First Published:  25 July 2015 12:38 AM GMT
Next Story