Telugu Global
Cinema & Entertainment

శోభా డే  బాహుబ‌లి రివ్యు.. 

ప్ర‌ముఖ కాల‌మిస్టు శో భా డే బాహుబ‌లి సినిమా గురించి మినీ రివ్యూ రాశారండోయ్. ఆమేకు న‌చ్చిన విష‌యాల్ని ముక్కు సూటిగా చెప్ప‌డంలో చాల ఫేమ‌స్. బాహుబ‌లి చిత్రం గురించి ఎన్డీటివి కి రాసిన ఒక లేఖ‌లో .. ఈ చిత్రంలో రాజ‌కుటుంబానికి న‌మ్మ‌క‌మైన బానిస రోల్ చేసిన స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ఆమెకు ఎంత‌గానో న‌చ్చింద‌ట‌. అత‌ని క్యారెక్ట‌ర్ కోసం బాహుబ‌లి 2 క‌చ్చితంగా చూస్తాన‌ని.. అలాగే ప్ర‌భాస్, రానాలు బాగా చేశార‌ని కితాబిచ్చారు. ఇక రాజ‌మాత […]

శోభా డే  బాహుబ‌లి రివ్యు.. 
X

ప్ర‌ముఖ కాల‌మిస్టు శో భా డే బాహుబ‌లి సినిమా గురించి మినీ రివ్యూ రాశారండోయ్. ఆమేకు న‌చ్చిన విష‌యాల్ని ముక్కు సూటిగా చెప్ప‌డంలో చాల ఫేమ‌స్. బాహుబ‌లి చిత్రం గురించి ఎన్డీటివి కి రాసిన ఒక లేఖ‌లో .. ఈ చిత్రంలో రాజ‌కుటుంబానికి న‌మ్మ‌క‌మైన బానిస రోల్ చేసిన స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ఆమెకు ఎంత‌గానో న‌చ్చింద‌ట‌. అత‌ని క్యారెక్ట‌ర్ కోసం బాహుబ‌లి 2 క‌చ్చితంగా చూస్తాన‌ని.. అలాగే ప్ర‌భాస్, రానాలు బాగా చేశార‌ని కితాబిచ్చారు. ఇక రాజ‌మాత రోల్ లో రమ్య‌కృష్ణ యాక్టింగ్ తో పాటు ఆమె క‌ట్టిన చీరలు ఎంతో బావున్నాయ‌ని పేర్కొన్నారు. ఇక దర్శ‌కుడు రాజ‌మౌళి గురించి కూడా త‌న అభిప్రాయం తెలిపారు. రాజ‌మౌళి ఇంగ్లీషు సినిమాల్ని చూసి బాగా స్ట‌డీ చేసి.. బాహుబ‌లికి ఏవి అవ‌స‌ర‌మో అవి ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడ‌ని చెప్పారు. ఇక చిత్రంలో గిర‌జ‌నుల్ని శ‌త్రువులుగా చూపిన విధానం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. మొత్తం మీద శోభా డే కు క‌ట్టప్ప రోల్ బాగా న‌చ్చేసింద‌ట‌. నిజ‌మే బాహుబ‌లి , భళ్లాల దేవ రోల్స్ త‌రువాత ఎక్కువ మంది మ‌న‌సు దోచుకుంటున్న రోల్స్ .. శివ‌గామి రోల్ .. క‌ట్ట‌ప్ప రోల్ అనే విష‌యం తెలిసిందే

First Published:  24 July 2015 7:10 PM GMT
Next Story