Telugu Global
National

మెమెన్ భ‌విష్య‌త్ తేలేది సోమవారం

1993 ముంబై వ‌రుస పేలుళ్ల కేసులో త‌న‌కు విధించిన ఉరిశిక్షను నిలిపి వేయాల‌ని  యాకూబ్ మెమ‌న్  సుప్రీంలో దాఖ‌లు చేసిన పిటిష‌న్ సోమ‌వారం నాడు విచార‌ణ‌కు రానుంది. దీంతో మెమ‌న్ భ‌విత‌వ్యం సోమ‌వారం నాడు తేల‌నుంది.  ముంబై బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌లో 257 మంది మృతికి, దాదాపు 700 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌డానికి యాకూబ్ కార‌ణ‌మ‌ని నిర్ధారించిన‌ టాడా కోర్టు అత‌డికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పుపై యాకూబ్ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా టాడా కోర్టు తీర్పును ముంబై […]

మెమెన్ భ‌విష్య‌త్ తేలేది సోమవారం
X

1993 ముంబై వ‌రుస పేలుళ్ల కేసులో త‌న‌కు విధించిన ఉరిశిక్షను నిలిపి వేయాల‌ని యాకూబ్ మెమ‌న్ సుప్రీంలో దాఖ‌లు చేసిన పిటిష‌న్ సోమ‌వారం నాడు విచార‌ణ‌కు రానుంది. దీంతో మెమ‌న్ భ‌విత‌వ్యం సోమ‌వారం నాడు తేల‌నుంది. ముంబై బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌లో 257 మంది మృతికి, దాదాపు 700 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌డానికి యాకూబ్ కార‌ణ‌మ‌ని నిర్ధారించిన‌ టాడా కోర్టు అత‌డికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పుపై యాకూబ్ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా టాడా కోర్టు తీర్పును ముంబై హైకోర్టు పూర్తిగా స‌మ‌ర్థించింది. టాడా కోర్టు విధించిన ఉరిశిక్ష‌ను ఈనెల 30న అమ‌లు చేయాల్సిందిగా తీర్పునిచ్చింది. అయితే, యాకూబ్ ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు గ‌వ‌ర్న‌ర్‌కు క్ష‌మాభిక్ష పిటిష‌న్ పెట్టుకున్నాడు. గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద క్ష‌మాభిక్ష పిటిష‌న్ పెండింగ్‌లో ఉన్నందున ఉరి శిక్ష అమ‌లును నిలిపి వేయాల‌ని కోరుతూ ఆఖ‌రి ప్ర‌య‌త్నంగా సుప్రీంను ఆశ్ర‌యించాడు. మెమ‌న్ పిటిష‌న్‌ను ఈనెల 27న విచారించేందుకు జ‌స్టిస్ ఏఆర్ ద‌వే నేతృత్వంలో ఇప్ప‌టికే ప్ర‌త్యేక ధ‌ర్మాస‌నాన్నిఏర్పాటు చేశామ‌ని సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ హెచ్ఎల్ ద‌త్తుతో కూడిన త్రిస‌భ్య బెంచ్ వెల్ల‌డించింది. దీంతో మెమ‌న్ భ‌విత‌వ్యంపై సుప్రీం తీసుకునే నిర్ణ‌యం ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. మ‌రోవైపు కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డానికి నాగపూర్ జైలు అధికారులు డ‌మ్మీ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు. జైలులో ఉరితీసే వేదిక ఏర్పాటు కోసం మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.23ల‌క్ష‌లు మంజూరు చేసింది.

First Published:  24 July 2015 1:07 PM GMT
Next Story