భ‌ళా బ‌జ‌రంగీ..!

స‌ల్మాన్ ఖాన్ అంటే ద‌బంగ్ లో మాదిరి స‌ర‌దా ఫైట్స్..  పాటలు.. గుర్తుస్తాయి.  బ‌జ‌రంగీ భాయిజాన్ లో  కండ‌ల‌వీరుడు ప‌తాక స్థాయిలో  క‌న్నీళ్లు  పెడ‌తుంటే..  అభిమానులు కంట పెడ‌తున్నారు.  స‌ల్మాన్ ఖాన్ కెరీర్ లో యాక్టింగ్ ప‌రంగా  ఒక మైల్ స్టోన్ గా  నిలిచింది ఈ చిత్రం. మ‌న తెలుగు ర‌చ‌యిత  విజ‌యేంద్ర ప్ర‌సాద్  అందించిన క‌థ‌ను   బాలీవుడ్ డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్ అంతే హృద్యంగా తెర‌మీద  చూపంచారు. ఇక  ఈ సినిమాలో  హ‌ర్సాలీ మ‌ల్హోత్ర ను చూసి  ముచ్చ‌ట ప‌డి పోతున్నారు. ఇక రంజాన్ పండ‌గ సంద‌ర్బంగా రిలీజ్ అయిన  ఈ చిత్రం కలెక్ష‌న్ల ప‌రంగా  దుమ్ము లేస్తుంది. తొలి వారం పూర్తి అయ్యే స‌రికి  బాయిజాన్   184.62 కోట్ల తో   బాలీవుడ్ లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌టం  విశేషం.  అమీర్ ఖాన్  పీకే సినిమా  రికార్డు ను  స‌ల్లుభాయ్  బ్రేక్ చేసేశాడు.  ఈ యేడాది లో  రెండు వంద‌ల కోట్లు  మార్క్ క్రాస్ చేసిన చిత్రం ఇదే అంటున్నారు ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్.