రాజ‌మండ్రి ఇక పై రాజమహేంద్రవరం…

పుష్క‌రాల ముగింపు సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌మండ్రి పేరును రాజ‌మ‌హేంద్ర‌వ‌రంగా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాజ‌మండ్రి పేరు గ‌తంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అనే ఉండేద‌ని అయితే బ్రిటీష్ వారు పిలుపుచుకోవ‌డానికి వీలుగా పేరు మార్చార‌ని ఆయ‌న అన్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రాన్ని ఆధునిక ప‌ర్యాట‌క‌ కేంద్రంగా, సాంస్క‌తిక కేంద్రంగా మారుస్తామ‌ని అందుకోసం తాత్కాలికంగా రూ. 100 కోట్లు కేటాయిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు పుష్క‌రాల్లో అద్భుత‌మైన ప‌నితీరును క‌న‌బ‌రిచార‌ని వారికి ప్ర‌త్యేక డీఏ ఇస్తామ‌ని ఆయ‌న అన్నారు. రాబోయే రోజుల్లో ప్ర‌తి పాఠ‌శాల‌లో కూచిపూడి నృత్యం నేర్పే ఏర్పాట్లు చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.