Telugu Global
Cinema & Entertainment

చెర్రీ సినిమాలో చిరంజీవి

ఇప్పటివరకు తండ్రి నటించిన సినిమాల్లో పాటలు, సీన్లు మాత్రమే అనుకరించాడు రామ్ చరణ్. కానీ మగధీర తర్వాత మళ్లీ తండ్రితో కలిసి నటించలేదు. ఆ లోటు అలానే ఉంది. ఇప్పుడా గ్యాప్ ను భర్తీ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు శ్రీనువైట్ల. రామ్ చరణ్ తో శ్రీనువైట్ల చేస్తున్న కొత్త సినిమాలో ఓ గెస్ట్ రోల్ ను చిరంజీవికి ఆఫర్ చేశారు. చిరు కూడా ఆ పాత్ర చేసేందుకు సముఖంగా ఉన్నట్టు సమాచారం. మగధీర సినిమా తరహాలోనే […]

చెర్రీ సినిమాలో చిరంజీవి
X
ఇప్పటివరకు తండ్రి నటించిన సినిమాల్లో పాటలు, సీన్లు మాత్రమే అనుకరించాడు రామ్ చరణ్. కానీ మగధీర తర్వాత మళ్లీ తండ్రితో కలిసి నటించలేదు. ఆ లోటు అలానే ఉంది. ఇప్పుడా గ్యాప్ ను భర్తీ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు శ్రీనువైట్ల. రామ్ చరణ్ తో శ్రీనువైట్ల చేస్తున్న కొత్త సినిమాలో ఓ గెస్ట్ రోల్ ను చిరంజీవికి ఆఫర్ చేశారు. చిరు కూడా ఆ పాత్ర చేసేందుకు సముఖంగా ఉన్నట్టు సమాచారం. మగధీర సినిమా తరహాలోనే ఇలా వచ్చి అలా మెరిసే పాత్రలో చిరంజీవి కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో కనిపించడానికి చిరంజీవి ఒప్పుకోవడానికి రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి మగధీర. రామ్ చరణ్ నటించిన మగధీరలో చిరంజీవి కూడా కనిపించాడు కాబట్టి ఆ సినిమా అంత హిట్టయిందని అంతా చెప్పుకున్నారు అప్పట్లో. ఆ సెంటిమెంట్ కొద్దీ చెర్రీ కొత్త సినిమాలో నటించేందుకు చిరు ఒప్పుకున్నట్టు సమాచారం. మరో కారణం ఏంటంటే.. 150వ సినిమాకు రెడీ అవుతున్న ఈ టైమ్ లో.. చెర్రీ సినిమాలో కనిపిస్తే అది మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిరంజీవి. సో.. చరణ్ కొత్త సినిమాలో చిరంజీవి నటించడం దాదాపు ఖాయమైందనే చెప్పుకోవాలి.
First Published:  25 July 2015 7:21 PM GMT
Next Story