Telugu Global
Cinema & Entertainment

జగపతిబాబుకు పోటీగా జేడీ

రజనీకాంత్ అప్ కమింగ్ మూవీలో జగపతిబాబు విలన్ గా నటించబోతున్నాడే వార్త మొన్నటివరకు కోలీవుడ్ లో హల్ చల్ చేసింది. కానీ ఇప్పుడు జగపతిబాబుకు పోటీ తయారయ్యాడు. జగపతిబాబుకు పోటీగా జేడీ చక్రవర్తి పేరు కూడా పరిశీలిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రజనీ నటించిన లింగ సినిమాలో విలన్ గా కనిపించాడు జగపతి బాబు. ఆ తర్వాత బాలయ్య సినిమాలో కూడా విలన్ గా మెప్పించాడు. దీంతో రజనీకాంత్ కొత్త సినిమాలో కూడా జగపతినే విలన్ గా తీసుకోవాలనుకున్నారు. […]

జగపతిబాబుకు పోటీగా జేడీ
X
రజనీకాంత్ అప్ కమింగ్ మూవీలో జగపతిబాబు విలన్ గా నటించబోతున్నాడే వార్త మొన్నటివరకు కోలీవుడ్ లో హల్ చల్ చేసింది. కానీ ఇప్పుడు జగపతిబాబుకు పోటీ తయారయ్యాడు. జగపతిబాబుకు పోటీగా జేడీ చక్రవర్తి పేరు కూడా పరిశీలిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రజనీ నటించిన లింగ సినిమాలో విలన్ గా కనిపించాడు జగపతి బాబు. ఆ తర్వాత బాలయ్య సినిమాలో కూడా విలన్ గా మెప్పించాడు. దీంతో రజనీకాంత్ కొత్త సినిమాలో కూడా జగపతినే విలన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ లింగ సినిమా ఎఫెక్ట్ కొత్త మూవీపై పడకూడదనే ఉద్దేశంతో, సెంటిమెంట్ కొద్దీ జగపతిని, రజనీకాంత్ కాదన్నాడని సమాచారం. దీంతో జగపతిబాబు స్థానంలో జేడీ చక్రవర్తి పేరుతో పాటు బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ పేర్లను పరిశీలిస్తున్నారు. వీళ్లలో కథాపరంగా చూసుకుంటే సత్యరాజ్ అంతగా సూటవ్వడని సమాచారం. దీంతో జేడీ చక్రవర్తివైపే మేకర్స్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అదే కనుక నిజమైతే.. రాబోయే రోజుల్లో జగపతిబాబు ఒప్పుకునే ప్రతి సినిమాకీ జేడీ చక్రవర్తి ఆల్టర్నేటివ్ గా మారడం ఖాయం. ప్రస్తుతం విష్ణు హీరోగా నటిస్తున్న డైనమేట్ సినిమాలో జేడీ విలన్ గా నటిస్తున్నాడు.
First Published:  25 July 2015 7:10 PM GMT
Next Story