Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సినిమాలో వినాయకుడి పాట

తన 99వ చిత్రంగా డిక్టేటర్ అనే సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రాక్ అండ్ పాప్ మిక్స్ చేస్తూ ఫుల్ జోష్ తో పాటలిచ్చే తమన్.. బాలయ్య కోసం పంథా మార్చుకున్నాడు. డిక్టేటర్ మూవీ కోసం ఓ దేవుడి పాట కంపోజ్ చేశాడు. వినాయకుడిపై ఓ మంచి పాటను స్వరపరిచాడు. బాలయ్య ఎంట్రీ సందర్బంగా ఈ పాటను పెట్టే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు.. రాబోయే […]

బాలయ్య సినిమాలో వినాయకుడి పాట
X
తన 99వ చిత్రంగా డిక్టేటర్ అనే సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రాక్ అండ్ పాప్ మిక్స్ చేస్తూ ఫుల్ జోష్ తో పాటలిచ్చే తమన్.. బాలయ్య కోసం పంథా మార్చుకున్నాడు. డిక్టేటర్ మూవీ కోసం ఓ దేవుడి పాట కంపోజ్ చేశాడు. వినాయకుడిపై ఓ మంచి పాటను స్వరపరిచాడు. బాలయ్య ఎంట్రీ సందర్బంగా ఈ పాటను పెట్టే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు.. రాబోయే వినాయకచవితి సందర్భంగా డిక్టేటర్ ఫస్ట్ లుక్ లో భాగంగా ఈ పాటతోనే ఓ టీజర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్. గతంలో బాలయ్య నటించిన ఎన్నో సినిమాల్లో దేవుడి పాటలున్నాయి. కానీ గణపతిపై మాత్రం పాట లేదు. డిక్టేటర్ తో ఆ లోటు కూడా తీరింది. కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ సినిమాలో అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
First Published:  25 July 2015 7:02 PM GMT
Next Story