Telugu Global
Cinema & Entertainment

చుట్టాలబ్బాయ్ కు అమ్మాయి దొరికింది

సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఆది, తాజాగా చుట్టాలబ్బాయ్ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను సెలక్ట్ చేశారు. స్టార్ హీరోల సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైన ప్రణీతను ఆది సరసన సోలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా షెడ్యూల్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఆది, గరమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మదన్ […]

చుట్టాలబ్బాయ్ కు అమ్మాయి దొరికింది
X
సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఆది, తాజాగా చుట్టాలబ్బాయ్ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను సెలక్ట్ చేశారు. స్టార్ హీరోల సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైన ప్రణీతను ఆది సరసన సోలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా షెడ్యూల్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఆది, గరమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మదన్ డైరక్షన్ లో మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. చుట్టాలబ్బాయ్ మూవీ సెట్స్ పైకి వస్తుంది.
తొలి సినిమా ప్రేమ కావాలి తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఆది. సాయికుమార్ తనయుడిగా ఇమేజ్ ఉన్నప్పటికీ.. దాన్ని తన సినిమాలకు అనుకూలంగా మలుచుకోలేకపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన గాలిపటం సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో గరమ్, చుట్టాలబ్బాయ్ సినిమాలపైనే ఈ యంగ్ హీరో ఆశలు పెట్టుకున్నాడు. చుట్టాలబ్బాయ్ సినిమాలో మొదట రాశిఖన్నాను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ బడా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఆది సినిమా ఆఫర్ ను పక్కనపెట్టింది రాశిఖన్నా. దీంతో ఆ ప్లేస్ లో ప్రణీతను ఎంపికచేశారు.
First Published:  25 July 2015 7:00 PM GMT
Next Story