Telugu Global
Cinema & Entertainment

రాధిక మళ్ళీ ఫైర్ అయ్యింది!

ఆ మధ్య ‘లెజెండ్’ హీరోయిన్ రాధికా ఆప్టే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన చాలా ఘాటుగానే విమర్శించింది. ఇక్కడ అంతా మేల్ డామినేషన్ అని… స్త్రీలకు అసలు విలువ ఇవ్వరని, వారిని వస్తువులుగా ట్రీట్ చేస్తారు అని…ఇక టాలివుడ్‌లో నటించనని డైరెక్ట్‌గా చెప్పేసింది. ఇక ఇప్పుడు బాలివుడ్ వంతు వచ్చినట్లుంది. బాలివుడ్‌లో హీరోయిన్ రెమ్యునరేషన్ చాలా తక్కువని, హీరోతో సమానంగా పని చేసినా చాలా తక్కువ పారితోషికం ఇవ్వడం కరెక్ట్ కాదని క్లాస్ పీకేసింది.  ఈ […]

రాధిక మళ్ళీ ఫైర్ అయ్యింది!
X
ఆ మధ్య ‘లెజెండ్’ హీరోయిన్ రాధికా ఆప్టే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన చాలా ఘాటుగానే విమర్శించింది. ఇక్కడ అంతా మేల్ డామినేషన్ అని… స్త్రీలకు అసలు విలువ ఇవ్వరని, వారిని వస్తువులుగా ట్రీట్ చేస్తారు అని…ఇక టాలివుడ్‌లో నటించనని డైరెక్ట్‌గా చెప్పేసింది. ఇక ఇప్పుడు బాలివుడ్ వంతు వచ్చినట్లుంది. బాలివుడ్‌లో హీరోయిన్ రెమ్యునరేషన్ చాలా తక్కువని, హీరోతో సమానంగా పని చేసినా చాలా తక్కువ పారితోషికం ఇవ్వడం కరెక్ట్ కాదని క్లాస్ పీకేసింది.
ఈ మధ్య ఫీమేల్ సెంట్రిక్ మూవీస్, టాప్ హీరోయిన్స్ అయిన కంగనా రనౌత్, దీపికా పడుకోన్, ప్రియాంక చోప్రా మొదలగువారు చేసిన మూవీస్ బాక్సాఫీస్‌ని బద్దలు చేసే కలెక్షన్స్ వసూలు చేసినా, ఆయా తారామణులకు మాత్రం రెమ్యూనరేషన్ పెద్దగా ఇవ్వలేదు. సినిమాలు వారి పేరు మీద ఆడినప్పుడు, కనీసం ఫీమేల్ సెంట్రిక్ మూవీ హీరోయిన్స్ కయినా రెమ్యూనరేషన్ బాగా పెంచాలని, హీరోలతో సమానంగా ఇవాలని రాధికా డిమాండ్ చేస్తోంది. మరీ బాలీవుడ్ ఎలా స్పందిస్తుందో ఏమో..!
First Published:  26 July 2015 4:00 AM GMT
Next Story