Telugu Global
Others

శ్రీ‌శాంత్ నిర్దోషి!

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో మైదానానికి దూర‌మైన ఇండియ‌న్ స్పీడ్‌స్ట‌ర్‌కు ఊర‌ట ల‌భించింది. తాజాగా ఈ ఫాస్ట్‌బౌల‌ర్‌తో స‌హా 16 మంది క్రికెట‌ర్ల‌కు విముక్తి ల‌భించింది. క్రికెట్‌ రంగంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు శనివారం నాడు వెలువరించింది. క్రికెటర్లు అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది. ఈ కేసులో క్రికెటర్లతో పాటు మొత్తం 42 మందిపై పోలీసులు చార్జీషీట్‌ దాఖలు చేశారు. శ్రీశాంత్‌, ఇతర క్రికెటర్లను నిర్ధోషులుగా ప్రకటించింది. కోర్టు […]

శ్రీ‌శాంత్ నిర్దోషి!
X
ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో మైదానానికి దూర‌మైన ఇండియ‌న్ స్పీడ్‌స్ట‌ర్‌కు ఊర‌ట ల‌భించింది. తాజాగా ఈ ఫాస్ట్‌బౌల‌ర్‌తో స‌హా 16 మంది క్రికెట‌ర్ల‌కు విముక్తి ల‌భించింది. క్రికెట్‌ రంగంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు శనివారం నాడు వెలువరించింది. క్రికెటర్లు అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది. ఈ కేసులో క్రికెటర్లతో పాటు మొత్తం 42 మందిపై పోలీసులు చార్జీషీట్‌ దాఖలు చేశారు. శ్రీశాంత్‌, ఇతర క్రికెటర్లను నిర్ధోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు శ్రీశాంత్‌లో కొత్త ఉత్సాహం నింపింది. తాను తిరిగి మైదానంలోకి త‌ప్ప‌కుండా అడుగుపెడ‌తాన‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. తిరిగి జాతీయ జ‌ట్టులో చోటు సాధిస్తాన‌ని ధీమాగా చెప్పాడు. ఇటీవ‌లే తండ్రి అయిన శ్రీ‌శాంత్ ఫిక్సింగ్ నేప‌థ్యంగా సాగే ఒక చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు.
First Published:  25 July 2015 9:39 PM GMT
Next Story