భానుకిరణ్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

మద్దెలచెర్వు హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌కు బెయిల్‌ ఇవ్వడం కుదరదని నాంపల్లి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ఉదయం వాదనలు విన్న కోర్టు తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది. మళ్ళీ కొలువు తీరిన కోర్టు అంతకుముందు బానుకిరణ్‌కు బెయిల్‌ ఇస్తే పారిపోతాడన్న సీఐడీ వాదనతో ఏకీభవించింది. తాను మూడేళ్లకు పైగా జైల్లో ఉన్నానని, తనకు బెయిల్‌ ఇవ్వాలని భానుకిరణ్‌ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బెయిలిస్తే భానుకిరణ్‌ మళ్లీ పారిపోతాడని సీఐడీ లాయర్‌ వాదించారు. 2011 జనవరి 3 న మద్దెలచెర్వు సూరి హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు తీర్పు ఇవ్వడంతో ఆయన్ను మళ్ళీ జైలుకు పంపించారు.