హా్ట్ బ్యూటీకి తొలి జీతం అలా వ‌చ్చింది…!

ఎవ‌రికైన తొలి సంపాద‌న‌..తొలి ముద్దు లాంటిది.  సినిమా ఇండ‌స్ట్రీలో  లైఫ్ ను వెతుక్కునే వారికి ఇది మ‌రింత మ‌ధురానుభూతి. కెరీర్ ప్రారంభంలో   ఎవ‌రు స్టార్.. సూప‌ర్ స్టార్ అవుతారో చెప్ప‌డం క‌ష్టం.  వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్ ను చేస్తుంటారు. ఎక్క‌డో ఒక దగ్గ‌ర బ్రేక్ వ‌స్తుంది. ఆ త‌రువాత  స్టార్ డ‌మ్ ..ఇలా ఒక ప్రాసెస్ వుంటుంది. అయితే అంద‌రు స‌క్సెస్ కావాల‌ని ..అవుతార‌ని న‌మ్మ‌కం లేదు. ఎవ‌రి సుడి ఎలా తిరిగుతుందో చెప్ప‌డం  మ‌హా క‌ష్టం.

 క‌ట్ చేస్తే.. బాలీవుడ్ లో ఒక ద‌శాబ్ధం పాటు హాట్  హీరోయిన్ గా  హ‌ల్ చ‌ల్ చేసిన బెంగాల్ బ్యూటీ బిపాసా బ‌సు  త‌న  జీవితంలో తొలిసారి అందుకున్న పారితోష‌కం మూడు వేల‌ట‌.  15  యేళ్ల వ‌య‌సులో  ర్యాంప్ వాక్ చేసింద‌ట‌. దాని నిమిత్తం   3 వేలు పారితోష‌కం సంపాదించుకుంద‌ట‌. ఆ త‌రువాత  హీరోయిన్ గా  ల‌క్ష‌ల్లో పారితోష‌కం తీసుకున్న గానీ.. ఫ‌స్ట్ టైమ్  పారితోష‌కం ఒక స్వీట్ మెమ‌రి అంటోంది.