మ‌రీ విడ్డూరం..!

ప్ర‌ళ‌యం ఎప్పుడో ఒక‌సారి వ‌స్తుంది. దాన్ని బీట్ చేయాలంటె మ‌హా ప్ర‌ళ‌యం రావాలి.    ఇప్ప‌టి   టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో   రాజ‌మౌళి చేసిన  బాహుబ‌లి  బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిందనే చెప్పాలి. ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్  విష‌యంలో  మెగా హీరోలు ఉన్న మాట వాస్త‌వ‌మే.  అయితే  బాహుబ‌లి త‌రువాత   బాహుబ‌లి మాత్ర‌మే నిలిచింది. దీంతో  ఎలాగైన  బాహుబ‌లి ఫ‌స్ట్ డే  బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ (44 కోట్లు) రికార్డు ను   ఓవ‌ర్ టేక్ చేయాల‌నే  ఆలోచ‌న  మెగా   హీరో  చేస్తున్న‌ట్లు  ఫిల్మ్ న‌గ‌ర‌ల్  లో ఒక గాసిప్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.,

ఎందుకంటే..బాహుబ‌లిని   ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ప‌రంగా   ఓవ‌ర్ టేక్ చేయాలంటే..కేవ‌లం  రాంచ‌ర‌ణ్ చిత్రంలో    చిరంజీవి  న‌టిస్తే  బ‌ద్ద‌లు కాదు.  అది అసంభవం.  ఈ విష‌యం  చిరంజీవి  కి తెలుసు. అస‌లు చిరు ఇటువంటి ఆలోచ‌న చేసి వుండ‌రు. ఏదో పుకారు లేవ దీసిన‌ట్లు స్ప‌ష్టం అవుతుంది.   ఎందుకంటే.. మహా భారతం లాంటి బాహుబ‌లిని  ఒక సోష‌ల్ స్టొరీ బేస్డ్ ఫిల్మ్  బీట్ చేయ‌డం  అంటే అది నిజంగా  గిన్నిస్ రికార్డ్  అనుకోవాలి . శీను వైట్ల ..రాంచ‌ర‌ణ్ , గోపి మోహ‌న్, కోన వెంక‌ట్  అంతా క‌ల‌సి  ఒక‌ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈసినిమాలో చిరు గెస్ట్ అప్పిరియ‌న్స్ ఉండ‌టం మాత్రం  నిజం కావోచ్చు . బాహుబ‌లి ఫ‌స్ట్ రికార్డ్ ను ..  బాహుబ‌లి సెకండ్ పార్టే  బ్రేక్ చేయాలి త‌ప్ప‌.. వేరే విధంగా అసాధ్యం…!  నో డౌట్.