మాజీ మాఫీయా డాన్ తో భేటి కానున్న వర్మ…

రాంగోపాల్ వ‌ర్మ కొత్త కంపెనీ….మ‌రో డాన్‌ని క‌ల‌వ‌బోతున్న ఆర్‌జివి

ర‌క్తం కధలు మ‌రిగిన ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌మ‌రో కంపెనీ తెర‌వ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే అండ‌ర్‌వాల్డ్ క‌థ‌తో మ‌రో సినిమాని తీయ‌బోతున్నాడు. మ‌రి ఈసారి వ‌ర్మ మాఫియా సినిమాకి హీరో ఎవ‌రు? ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం.. వ‌ర్మ ఈసారి క‌ర్ణాట‌క డాన్‌పై మ‌న‌సు పారేసుకున్నాడు. ఒక‌ప్పుడు అండ‌ర్‌వాల్డ్ డాన్‌గా ఇప్పుడు పారిశ్రామిక‌వేత్తగా, ప్రజ టీవి ప్రారంభించడం ద్వారా మీడియా బిజినెస్ లో సెటిలైన ముత్త‌ప్ప రాయ్ క‌థ‌ని సినిమా తీయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ముత్త‌ప్ప‌రాయ్ పేరు చెబితేనే ఒక‌ప్పుడు క‌న్న‌డ‌సీమ వ‌ణికేది. అండ‌ర్‌వాల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంతో కూడా ముత్త‌ప్ప‌కు సంబంధాలుండేవ‌ని ప్ర‌చారం. ఏ సినిమా తీసినా వ‌ర్మ‌కి ఫ‌స్ట్‌హ్యాండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ తీసుకోవ‌డం అల‌వాటు. అందుకే క‌ర్ణాట‌క డాన్ ముత్త‌ప్ప‌ను క‌ల‌వ‌డానికి బెంగ‌ళూరుకు వెళ్తున్నాడుట‌! సో.. వ‌ర్మ నుంచి మ‌రో కంపెనీ త్వ‌ర‌లోనే రాబోతోంద‌న్న‌మాట‌!