Telugu Global
NEWS

జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్నాటక హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మళ్లీ విచారణ జరపాలన్న కర్నాటక ప్రభుత్వ పిటిషన్‌పై జయలలితకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఇటీవల జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. కింది కోర్టు తీర్పుకు, హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ఇచ్చిన తీర్పునకు మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ బీవీ ఆచార్య పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే సుప్రీంకోర్టులో […]

జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు
X
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్నాటక హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మళ్లీ విచారణ జరపాలన్న కర్నాటక ప్రభుత్వ పిటిషన్‌పై జయలలితకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఇటీవల జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. కింది కోర్టు తీర్పుకు, హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ఇచ్చిన తీర్పునకు మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ బీవీ ఆచార్య పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే సుప్రీంకోర్టులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం జయలలితకు నోటీసులు జారీ చేసింది.
First Published:  27 July 2015 1:55 AM GMT
Next Story