వెంకీ, న‌య‌న హ్యాట్రిక్ కొడ‌తారా..? 

వెండి తెర పై కొన్ని జోడి ల‌కు  కెమిస్ట్రి బాగా పండుతుంది.  అలా వెంకీ ,న‌య‌న‌తార ల జంట  అభిమానుల్ని మెప్పించింది. ఆఫ్ కోర్స్ వీరిద్ద‌రు క‌ల‌సి న‌టించిన చిత్రాలు డ‌జ‌న్ల కొద్ది లేవు . రెండంటే రెండే చిత్రాలు. ఒక‌టి  ల‌క్ష్మీ  సినిమా ..మ‌రొక‌టి   తుల‌సి చిత్రం. ల‌క్ష్మీ సినిమా కుటుంబ క‌థా చిత్రం కావ‌డంతో  సూప‌ర్ హిట్ అయ్యింది.  వెంకీ, న‌య‌న ల మ‌ధ్య  ల‌వ్ ట్రాక్  పండింది. ఇద్ద‌రి మ‌ధ్య స్క్రీన్ కెమిస్ట్రి  చాల స‌హాజంగా పండింది.   అంత కాక పోయినా.. తుల‌సి చిత్రంలో కూడా  మెప్పించారు.

ఇక తాజాగా ఈ జంట మూడోసారి క‌ల‌సి న‌టించ బోతున్నార‌నే టాక్  ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిప‌స్తుంది.   ఓన‌మాలు,  మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానీ రోజు చిత్రాలు డైరెక్ట్ చేసిన క్రాంతి మాధ‌వ్  ..  వెంక‌టేష్ తో ఒక చిత్రం చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌. దీనిక సంబంధించి  వెంక‌టేష్ కు క‌థ వినిపించడం. ..ఆయ‌న గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డం అన్ని జ‌రిగిపోయాయ‌ట‌.   ప‌రుచూరి ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తార‌నే టాక్ వినిపిస్తుంది. అన్ని క‌ల‌సి వ‌స్తే త్వ‌ర‌లో  ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశాలు ఎక్కువుగా వున్నాయ‌నేది  క్రాంతి మాధ‌వ్ స‌న్నిహితులు స‌మాచారం. మ‌రి వెంకీ, న‌య‌న ల జోడి  హ్య‌ట్రిక్ కొట్టాల‌ని ఆశిస్తున్నారు   వారి అభిమానులు.