Telugu Global
Others

ఆరోగ్య‌శ్రీ కార్మికుల స‌మ్మెతో ఉచిత వైద్య‌సేవలకు ఆటంకం 

ఆరోగ్య‌శ్రీ లోని కాంట్రాక్ట్ కార్మికులు చేప‌ట్టిన స‌మ్మెతో ఉచిత వైద్య సేవ‌లు అంద‌క రోగులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఆరోగ్య‌శ్రీ‌లో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ర‌ద్దు చేసి క‌నీస‌ వేత‌న చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌నే ప‌లు డిమాండ్ల‌తో కార్మికులు సమ్మె చేప‌ట్టారు. వీరి స‌మ్మె పేద రోగుల‌పై తీవ్ర  ప్ర‌భావం చూపింది. ఖ‌రీదైన వైద్య చికిత్స‌ల‌ను చేయించుకునే స్థోమ‌త లేని పేద‌లు ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవ‌లను పొందలేక నిరాశకు గురవుతున్నారు. హైద‌రాబాద్‌లో ఆరోగ్య‌శ్రీ ద్వారా వైద్యం […]

ఆరోగ్య‌శ్రీ లోని కాంట్రాక్ట్ కార్మికులు చేప‌ట్టిన స‌మ్మెతో ఉచిత వైద్య సేవ‌లు అంద‌క రోగులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఆరోగ్య‌శ్రీ‌లో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ర‌ద్దు చేసి క‌నీస‌ వేత‌న చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌నే ప‌లు డిమాండ్ల‌తో కార్మికులు సమ్మె చేప‌ట్టారు. వీరి స‌మ్మె పేద రోగుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. ఖ‌రీదైన వైద్య చికిత్స‌ల‌ను చేయించుకునే స్థోమ‌త లేని పేద‌లు ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవ‌లను పొందలేక నిరాశకు గురవుతున్నారు. హైద‌రాబాద్‌లో ఆరోగ్య‌శ్రీ ద్వారా వైద్యం అందిస్తున్న నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ, నిలోఫ‌ర్‌, ఈఎన్‌టీ, ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి, బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి, కేర్‌, అపోలో వంటి ప‌లు పెద్దాసుప‌త్రుల్లో ఆరోగ్య‌శ్రీ సేవ‌లు నిలిచిపోయాయి.
First Published:  27 July 2015 1:06 PM GMT
Next Story