ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఛార్జిషీటు దాఖలు

ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధక శాఖ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ, మత్తయ్యలను నిందితులుగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 39 మంది సాక్ష్యులను విచారించినట్టు ఏసీబీ తన ఛార్జిషీటులో పేర్కొంది.