Telugu Global
Others

రాజధాని ప్రాంతంలో ఇక హౌస్ పూలింగ్....

కొత్త రాజ‌ధాని కోసం ల్యాండ్ పూలింగ్ జ‌రిపిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇపుడు హౌస్ పూలింగ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణంలో అడ్డొచ్చే నివాస గృహాల్ని తప్పించేందుకు సన్నద్ధమవుతోంది. దీనికి అనుగుణంగా అధికారులు విధి విధా నాలను రూపొందించే పనిలో ప‌డ్డారు. సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ విడుదలైన తర్వాత రాజ‌ధాని ప్రాంత ప్ర‌జ‌లకు అనేక కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. సీడ్‌ క్యాపిటల్‌ గ్రామాలలోని నివాస గృహాలను ఖాళీ చేయవలసిందిగా అధికారులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. తాము […]

రాజధాని ప్రాంతంలో ఇక హౌస్ పూలింగ్....
X

కొత్త రాజ‌ధాని కోసం ల్యాండ్ పూలింగ్ జ‌రిపిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇపుడు హౌస్ పూలింగ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణంలో అడ్డొచ్చే నివాస గృహాల్ని తప్పించేందుకు సన్నద్ధమవుతోంది. దీనికి అనుగుణంగా అధికారులు విధి విధా నాలను రూపొందించే పనిలో ప‌డ్డారు. సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ విడుదలైన తర్వాత రాజ‌ధాని ప్రాంత ప్ర‌జ‌లకు అనేక కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. సీడ్‌ క్యాపిటల్‌ గ్రామాలలోని నివాస గృహాలను ఖాళీ చేయవలసిందిగా అధికారులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. తాము ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ళు ఖాళీ చేయబోమని ప్రజలు వారికి తెగేసి చెబుతున్నారు. దీనితో వ్యవసాయ భూములను పూలింగ్‌ చేసిన విధంగానే రాజధాని ప్రాంతంలో ఇళ్ళ పూలింగ్‌ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. వ్యవసాయ భూములకు ఇళ్ళస్థలాలు ఇచ్చినట్లే ప్రత్యామ్నాయం చూపి రాజధాని గ్రామాలలో నివాస గృహాలను ఖాళీ చేయించాలని అనుకుంటోంది. తొలుత సీడ్‌ క్యాపిటల్‌ గ్రామాలతో ప్రారంభించి హౌస్‌ పూలింగ్‌ పథకాన్ని అన్ని రాజధాని గ్రామాలకు విస్తరించే అవకాశమున్నట్లు సమాచారం. సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలోని ఉద్దండ రాయిని పాలెం, తాళ్ళాయిపాలెం, లింగాయపాలెం, వెలగపూడి గ్రామాలలో సుమారు 3వేల నివాస గృహాలున్నాయని అంచనా. కొత్త రాజధానిలో గృహ వసతి చూపేవరకు ఖాళీచేయించిన వారు ఎక్కడుండాలన్నది ఇప్పుడు ప్ర‌ధాన‌ సమస్యగా ఉంది. ల్యాండ్‌ పూలింగ్‌కు అంగీకరించినందుకే మల్లగుల్లాలు పడుతున్న రాజధాని వాసులు ఈ హౌస్ పూలింగ్ ప్ర‌తిపాద‌న‌ల‌పై మండిప‌డుతున్నారు. ఇళ్ల జోలికొస్తే అంతుచూస్తామ‌ని బెదిరిస్తున్నారు.

First Published:  27 July 2015 8:05 PM GMT
Next Story