Telugu Global
Others

ఏపీ పోలీసుల ద్వంద వైఖ‌రి!

ఏపీ పోలీసులు కొంత‌కాలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని చూస్తుంటేనే అర్థ‌మ‌వుతోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఏడాదికాలంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. వారి ఆరోప‌ణ‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే రోజురోజుకు వారి వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఓటుకు నోటు కేసు స‌మ‌యంలో తెలంగాణ‌లో త‌న‌కు సీఎం కేసీఆర్ వ‌ల్ల ప్రాణ‌హాని ఉందంటే.. విజ‌య‌వాడ పోలీసులు ఎక్క‌డ‌లేని దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కేసులో జెరుస‌లేం మ‌త్త‌య్య ఎ-4  నిందితుడు అని తెలిసి కూడా అత‌నిచ్చిన ఫిర్యాదు ఆధారంగా […]

ఏపీ పోలీసుల ద్వంద వైఖ‌రి!
X
ఏపీ పోలీసులు కొంత‌కాలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని చూస్తుంటేనే అర్థ‌మ‌వుతోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఏడాదికాలంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. వారి ఆరోప‌ణ‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే రోజురోజుకు వారి వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఓటుకు నోటు కేసు స‌మ‌యంలో తెలంగాణ‌లో త‌న‌కు సీఎం కేసీఆర్ వ‌ల్ల ప్రాణ‌హాని ఉందంటే.. విజ‌య‌వాడ పోలీసులు ఎక్క‌డ‌లేని దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కేసులో జెరుస‌లేం మ‌త్త‌య్య ఎ-4 నిందితుడు అని తెలిసి కూడా అత‌నిచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రిపై ఫిర్యాదు ఇవ్వ‌గానే చిత్తం ప్ర‌భూ! అన్న రీతిలో స్వీక‌రించారు. కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ప‌క్క రాష్ర్టంలో మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయ‌ని మంత్రి దేవినేని ఫిర్యాదుఇవ్వ‌గానే దానిపై ఆఘ‌మేఘాల‌పై కేసు న‌మోదుచేసి ఆప‌రేట‌ర్ల‌ను విచార‌ణ పేరుతో విజ‌య‌వాడ‌కు తిప్పుతున్నారు. వీరంతా టీడీపీకి చెందిన వారుకావ‌డం గ‌మ‌నార్హం!
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ తెరుస్తారు. ఎమ్మార్వోపై దాడిచేసిన టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనిపై ఎలాంటి చ‌ర్య తీసుకోరు. దాడి చేస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌క పాత్ర‌పోషిస్తారు. ఇదేం తీరో అర్థం కావ‌డం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ తీవ్ర అప‌వాదు మూట‌గ‌ట్టుకుంటున్నారు. రాజమండ్రి పుష్క‌ర తొక్కిస‌లాట‌లో 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లో చంద్ర‌బాబుపై ఫిర్యాదు చేస్తే మాత్రం తీసుకోక‌పోవ‌డంతో వారి టీడీపీ అనుకూల వైఖ‌రి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.
చంద్ర‌బాబుపై కేసుకు వెన‌కాడ‌తారేం: ర‌ఘువీరా
మందిది మంగ‌ళ‌వారం.. మ‌న‌ది సోమ‌వారం అన్నాడ‌ట‌..! వెన‌క‌టికొక‌డు..స‌రిగ్గా ఇలాగే ఉంది. ఏపీ పోలీసుల తీరు. పుష్క‌రాల్లో 29 మంది మృతికి చంద్ర‌బాబు నాయుడే కార‌ణ‌మంటూ రాజ‌మండ్రిలోని ప‌లు పోలీసుస్టేష‌న్ల‌లో ప‌లువురు ఫిర్యాదులు చేశారు. అయినా వీటిపై పోలీసులు ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌లేదు. ఏపీ సీఎంపై కేసు న‌మోదుకు ఎందుకు వెన‌కాడుతున్నార‌ని రాష్ర్ట పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ప్ర‌శ్నించారు. అమాయ‌కులైన ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డానికి ఆయ‌న పుష్క‌ర స్నాన‌మే కార‌ణ‌మ‌ని కాబ‌ట్టి ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.
First Published:  27 July 2015 11:30 PM GMT
Next Story