Telugu Global
Cinema & Entertainment

బాహుబలి విలన్ తో లోఫర్

చరణ్ దీప్.. ఈ పేరు చాలామందికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఫొటో చూపిస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. బాహుబలి సినిమాలో విలన్ గా నటించిన చరణ్ దీప్.. తమిళనాట జిల్లా, తెలుగులో పటాస్ లాంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఆరడుగుల సిక్స్ ప్యాక్ విలన్.. మరో ఆరడుగుల సిక్స్ ప్యాక్ హీరోతో ఫైట్ కు సిద్ధమయ్యాడు. మెగా కాంపౌండ్ కు చెందిన వరుణ్ తేజ కొత్త సినిమాలో చరణ్ దీప్ ను విలన్ గా తీసుకున్నాడు […]

బాహుబలి విలన్ తో లోఫర్
X
చరణ్ దీప్.. ఈ పేరు చాలామందికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఫొటో చూపిస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. బాహుబలి సినిమాలో విలన్ గా నటించిన చరణ్ దీప్.. తమిళనాట జిల్లా, తెలుగులో పటాస్ లాంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఆరడుగుల సిక్స్ ప్యాక్ విలన్.. మరో ఆరడుగుల సిక్స్ ప్యాక్ హీరోతో ఫైట్ కు సిద్ధమయ్యాడు. మెగా కాంపౌండ్ కు చెందిన వరుణ్ తేజ కొత్త సినిమాలో చరణ్ దీప్ ను విలన్ గా తీసుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరుగుతోంది. ఇప్పటికే హీరో, విలన్ మధ్య ఓ బ్రహ్మాండమైన ఫైట్ సీక్వెన్స్ ను కూడా పిక్చరైజ్ చేశారు. లోఫర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన దిషా హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ నాటికి షూటింగ్ పూర్తిచేసి అక్టోబర్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. పూరి జగన్నాధ్ స్టయిల్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది లోఫర్ సినిమా.
First Published:  27 July 2015 7:03 PM GMT
Next Story