ఇంత కాలానీకి  న‌వ్వించాడు…

అల్ల‌రి చిత్రంతో  ప‌రిచ‌యమైన  న‌రేష్.. పుష్క‌ర కాలంలోనే  ఆఫ్ సెంచరీ కొట్ట‌డానికి ఒక‌ప‌రుగు దూరంలో వున్నాడు.  నిజంగా  ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో   ఆఫ్ సెంచ‌రీ చేయ‌డం అంటే   ..న‌రేష్ నిజంగా జ‌ట్ స్పీడ్ తో వ‌చ్చాడ‌నే చెప్పాలి.  అయితే స్పీడ్ ఎక్కువైన ..త‌క్కువైన‌.. క‌థ‌లు ఎంపిక స‌రిగా లేక‌పోతే    బాక్సాఫీస్ ద‌గ్గ‌ర   నీర‌సప‌డాల్సిందే.    ఆహ నా పెళ్లంటా చిత్రం త‌రువాత నుంచి  అల్ల‌రి న‌రేష్ కు ఒక్క హిట్ లేదు. మంచి క‌థ ప‌డ‌లేదు. 
 తాజాగా విడుద‌లైన జేమ్స్ బాండ్ చిత్రం  పై అల్ల‌రి న‌రేష్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.  ద‌ర్శ‌కుడు  సాయి కిషోర్  కొత్త ద‌ర్శ‌కుడు అయిన‌ప్ప‌టికి..  నిర్మాత అనిల్ సుంకర త‌న పై ఉంచిన  న‌మ్మ‌కాన్ని  వ‌మ్ము  చేయ‌లేదు.  బాహుబ‌లి ట్రాన్స్ లో వున్న  ఆడియ‌న్స్ ను   అల్ల‌రి న‌రేష్   న‌వ్వించి  బ‌య‌ట‌కు తీసుకు వ‌స్తున్నాడు.  ఆడియ‌న్స్ న‌వ్వితే..  ఆటోమెటిక్ గా హీరో అండ్ టీమ్ న‌వ్విన‌ట్లే క‌దా. సో మ‌నల్ని న‌వ్విస్తే.. అంత లాభం  అన్న‌మాట‌. ఎనీవే మ‌న అల్ల‌రోడు బౌన్స్ బ్యాక్  అయిన‌ట్లే మ‌రి.