Telugu Global
Cinema & Entertainment

తమిళ్ పై మహేష్ ప్రత్యేక శ్రద్ధ

ఎప్పుడూ లేని విధంగా ఈసారి తమిళ ఇండస్ట్రీపై కూడా మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇన్నాళ్లూ తన సినిమాలకు సంబంధించి కేవలం టాలీవుడ్‌పై మాత్రమే దృష్టిపెట్టేవాడు మహేష్. కానీ శ్రీమంతుడు విషయంలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను కూడా కలుపుకుని పోతున్నాడు. దీనికి కారణం రికార్డు వసూళ్లపై కన్నేయడమే. అవును.. తన సినిమాకు రికార్డు వసూళ్లు రావాలంటే కేవలం టాలీవుడ్ పైనే ఆధారపడితే సరిపోదు. కోలీవుడ్ పై కూడా దృష్టిపెట్టాలి. కుదిరితే బాలీవుడ్ ను కూడా […]

తమిళ్ పై మహేష్ ప్రత్యేక శ్రద్ధ
X
ఎప్పుడూ లేని విధంగా ఈసారి తమిళ ఇండస్ట్రీపై కూడా మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇన్నాళ్లూ తన సినిమాలకు సంబంధించి కేవలం టాలీవుడ్‌పై మాత్రమే దృష్టిపెట్టేవాడు మహేష్. కానీ శ్రీమంతుడు విషయంలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను కూడా కలుపుకుని పోతున్నాడు. దీనికి కారణం రికార్డు వసూళ్లపై కన్నేయడమే. అవును.. తన సినిమాకు రికార్డు వసూళ్లు రావాలంటే కేవలం టాలీవుడ్ పైనే ఆధారపడితే సరిపోదు. కోలీవుడ్ పై కూడా దృష్టిపెట్టాలి. కుదిరితే బాలీవుడ్ ను కూడా కవర్ చేయాలి. ఈమధ్య వచ్చిన బాహుబలి సినిమా విషయంలో ఇదే జరిగింది. అందుకే శ్రీమంతుడు సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. ఇప్పటికే సెల్వంధన్ పేరుతో శ్రీమంతుడు సినిమా తమిళనాట విడుదలకు సిద్ధమౌతోంది. ఇప్పుడు ఆడియో సాంగ్స్ తో కూడా హల్ చల్ చేయడానికి రెడీ అవుతోంది. స్వయంగా మహేష్, శ్రీమంతుడు తమిళ ఆడియో పాటల్ని విడుదల చేయడానికి సిద్ధమౌతున్నాడు. ఈనెల 31న చెన్నైలో జరిగే ఓ కార్యక్రమంలో శ్రీమంతుడు తమిళ పాటల్ని మహేష్ విడుదల చేయబోతున్నాడు. అలా తమిళ్ లో కూడా తన సినిమాకు ప్రచారం కల్పించాలనుకుంటున్నాడు.
First Published:  27 July 2015 7:00 PM GMT
Next Story