Telugu Global
NEWS

అక్కాచెల్లెళ్ళ హంతకుడు అమిత్ సింగ్ అరెస్ట్

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అక్కాచెల్లెళ్ళ హత్య కేసులో నిందితుడు అమిత్‌సింగ్‌ పోలీసులకు చిక్కాడు. అతని మొబైల్‌ కాల్‌ డేటా ఆధారంగా ఈ కేసులో నిందితుడైన అమిత్‌ను గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. తల్లిదండ్రులతో కలిసి వనస్థలిపురంలో ఉంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు యామిని, శ్రీలేఖలను దారుణంగా అమిత్‌ హత్య చేశాడు. యామినిని ఇంటర్ నుంచి ప్రేమ పేరుతో ఈ అమిత్ సింగ్ వేధించడం మొదలు పెట్టాడు. అతడి ప్రేమను యామిని తిరస్కరించడంతో అమిత్ […]

అక్కాచెల్లెళ్ళ హంతకుడు అమిత్ సింగ్ అరెస్ట్
X
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అక్కాచెల్లెళ్ళ హత్య కేసులో నిందితుడు అమిత్‌సింగ్‌ పోలీసులకు చిక్కాడు. అతని మొబైల్‌ కాల్‌ డేటా ఆధారంగా ఈ కేసులో నిందితుడైన అమిత్‌ను గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. తల్లిదండ్రులతో కలిసి వనస్థలిపురంలో ఉంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు యామిని, శ్రీలేఖలను దారుణంగా అమిత్‌ హత్య చేశాడు. యామినిని ఇంటర్ నుంచి ప్రేమ పేరుతో ఈ అమిత్ సింగ్ వేధించడం మొదలు పెట్టాడు. అతడి ప్రేమను యామిని తిరస్కరించడంతో అమిత్ సింగ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ప్రేమోన్మాదిగా మారిన అమిత్ సింగ్ యామిని ఇంటికెళ్లి అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. అడ్డుకోబోయిన యామిని అక్క శ్రీలేఖపై కూడా ఆ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి పాశవికంగా హతమార్చాడు.
శ్రీలేఖను, ఆమె అక్క యామినీ సరస్వతిని హత్య చేసిన తర్వాత అమిత్‌‌సింగ్ ఎల్బీనగర్ ప్రాంతంలో సంచరించినట్లు అతని చివరి ఫోన్ కాల్ ద్వారా గుర్తించారు. అమిత్ సింగ్ చదివాడని చెబుతున్న నారాయణగూడా, ఇబ్రహీంపట్నంలలోని కాలేజీలకు వెళ్లి స్నేహితుల వద్ద ఆరా తీశారు. అయితే, అతను ఆ కాలేజీల్లో చదవడం లేదని తేల్చుకున్న పోలీసులు ఆ తర్వాత అతని స్వస్థలమైన షాద్‌నగర్ వెళ్లారు. కానీ అక్కడ అమిత్‌సింగ్ కుటుంబ సభ్యుల ఇంటికి తాళం వేసి ఉంది. కాగా నిందితుడు జులై 14న నేరుగా సికింద్రాబాద్ చేరుకుని ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించినట్టు సమాచారం. ఆ తర్వాత అక్కడినుంచి గుజరాత్‌కు పరారైనట్టు ఆధారాలు లభించడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. అమిత్ సింగ్ గుజరాత్ రాష్ట్రంలో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.
First Published:  28 July 2015 4:55 AM GMT
Next Story