Telugu Global
Cinema & Entertainment

సుకుమార్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదేనా?

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్  ఓ సినిమా చేస్తున్నాడు. లండన్ లో ఈ మూవీ షూటింగ్ ఏకథాటిగా నడుస్తోంది. అయితే సినిమాకు సంబంధించి స్టోరీలైన్ మాత్రం ఎవరికీ తెలియదు. కొందరేమో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటారు. మరికొందరు పక్కా మాస్ సినిమా అంటారు. నాన్నకు ప్రేమతో అనే టైటిల్ గతంలో చర్చకొచ్చింది కాబట్టి ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనరే అని వాదించారు చాలామంది. కానీ సినిమా టైటిల్ అది కాదని స్వయంగా సుకుమార్ స్పష్టంచేశాడు. దీంతో మరోసారి […]

సుకుమార్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదేనా?
X
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. లండన్ లో ఈ మూవీ షూటింగ్ ఏకథాటిగా నడుస్తోంది. అయితే సినిమాకు సంబంధించి స్టోరీలైన్ మాత్రం ఎవరికీ తెలియదు. కొందరేమో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటారు. మరికొందరు పక్కా మాస్ సినిమా అంటారు. నాన్నకు ప్రేమతో అనే టైటిల్ గతంలో చర్చకొచ్చింది కాబట్టి ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనరే అని వాదించారు చాలామంది. కానీ సినిమా టైటిల్ అది కాదని స్వయంగా సుకుమార్ స్పష్టంచేశాడు. దీంతో మరోసారి తారక్ నయామూవీకి సంబంధించి చర్చ ఫ్రెష్ గా మొదలైంది. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు అభిరామ్ అని తెలుస్తోంది. అంతేకాదు.. సినిమాలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ అధికారిగా కనిపిస్తాడని కూడా వార్తలొస్తున్నాయి. అందుకే కాస్త ఎనర్జిటిక్ గా, మరింత మోడ్రన్ గా కనిపించే ఉద్దేశంతో హెయిర్ స్టయిల్ మార్చారని అంటున్నారు. ఇప్పటికే లండన్ లో యాక్షన్ సీన్లు తీసిన అనుభవం సుకుమార్ కు ఉంది కాబట్టి.. ఎన్టీఆర్ సినిమా కోసం కూడా మరోసారి లండన్ కే వెళ్లాడని అంతా అనుకుంటున్నారు. అదే నిజమైతే.. తారక్-సుక్కూ కాంబినేషన్ లో రానున్న తొలి చిత్రం ఓ పక్కా మాస్ ఎంటర్ టైనర్ కానుందన్నమాట.
First Published:  27 July 2015 7:01 PM GMT
Next Story