Telugu Global
Cinema & Entertainment

మెగా హీరోలే కాదు ..ఎవ‌రైన అంతే !

బాహుబ‌లి చిత్రం క‌లెక్ష‌న్లు మ‌న స్టార్ హీరోల్ని ఆలోచింప చేస్తున్నాయి.  ఆ రికార్డ్స్ ను బ‌ద్ద‌లు కొట్టడం ఎలా అని కొంద‌రు అలోచిస్తుంటే..  ఆ త‌ర‌హా ఒక భారీ చిత్రాన్ని ఎలా చేసి  త‌ము కూడా త‌మ స్టార్ డ‌మ్ ను ఘ‌నంగా చాటుకోవాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు.  ఇందులో భాగంగా బాహుబ‌లి రికార్డ్స్ కు ముందు మెగా హీరోల పేరు  మీద చాల బాక్సాఫీస్ రికార్డ్స్ వున్నాయి.  అయితే మ‌న జ‌క్క‌న్న ప్ర‌భాస్, రానా ల‌తో కల‌సి […]

మెగా హీరోలే కాదు ..ఎవ‌రైన అంతే !
X

బాహుబ‌లి చిత్రం క‌లెక్ష‌న్లు మ‌న స్టార్ హీరోల్ని ఆలోచింప చేస్తున్నాయి. ఆ రికార్డ్స్ ను బ‌ద్ద‌లు కొట్టడం ఎలా అని కొంద‌రు అలోచిస్తుంటే.. ఆ త‌ర‌హా ఒక భారీ చిత్రాన్ని ఎలా చేసి త‌ము కూడా త‌మ స్టార్ డ‌మ్ ను ఘ‌నంగా చాటుకోవాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబ‌లి రికార్డ్స్ కు ముందు మెగా హీరోల పేరు మీద చాల బాక్సాఫీస్ రికార్డ్స్ వున్నాయి. అయితే మ‌న జ‌క్క‌న్న ప్ర‌భాస్, రానా ల‌తో కల‌సి గొప్ప చిత్రం చేసి తెలివిగా మార్కెట్ చేసి.. ఒక ప్రాంతీయ భాష‌లో చేసిన చిత్రాన్ని అంత‌ర్జాతీయ చిత్రం చేసి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాడు.

అయితే బాహుబ‌లి రికార్డ్స్ ను మెగా హీరోలు లేదా.. వేరే ఎవ‌రైనా..ఎంత‌టి స్టార్ హీరో అయినా.. ఈవెన్ ప్ర‌భాస్ అయినా.. బాహుబ‌లి అన్ని భాష‌ల్లో క‌ల‌పి క‌లెక్ట్ చేసిన 400 వంద‌ల కోట్ల రికార్డ్ ను ఒక రెగ్యుల‌ర్ చిత్రం చేసి బ్రేక్ చేయ‌లేరు. బాహుబ‌లిని మించిన చిత్రంతో.. ఒక ఎపిక్ లేదా..పిరియాడిక్ ఫిల్మ్ ను చేసి ..ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్ చేస్తే నే సాధ్య ప‌డుతుంది.

ఇక తాజాగా బాహుబ‌లి ని మెగా హీరో చిరు ఓవ‌ర్ టేక్ చేసే చాన్స్ వుందంటు.. ఆయ‌న గ‌తంలో హీరోగా చేసిన ది థీఫ్ ఆఫ్ భాగ్దాద్ అనే చిత్రాన్ని గుర్తు చేస్తున్నారు. మ‌ధ్య యుగ ప‌ర్షియాకు చెందిన ఒక దొంగ జీవిత క‌థ‌గా అంత‌ర్జాతీయ చిత్రంగా కొంత షూటింగ్ చేశారు. అయితే అర్ధిక అంశాల‌తో పాటు.. ఇత‌ర రీజ‌న్స్ తో ఆ సినిమా షూటింగ్ చేయకుండా అలాగే చుట్టేసి అట‌క మీద ప‌డేశారు. అయితే అటువంటి చిత్రం తో చిరు వ‌స్తే.. హాలీవుడ్ ఫిల్మ్ రేంజ్ లో వుండే అవ‌కాశం వుంది కాబ‌ట్టి.. ప్ర‌చారం బాగా వుంటుంది కాబ‌ట్టి.. బాహుబ‌లి క‌లెక్ష‌న్స్ కు ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంది అని అంచ‌నాలు వేస్తున్నారు. అయితే 60 సంవ‌త్స‌రాల చిరంజీవికి.. 30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో వున్న చిరు కు ఎంతో వ్య‌త్యాసం వుంటుంది అనే విష‌యం మ‌ర‌వ కూడదు. ఏది ఏమైన మ‌హా భార‌తం లాంటి బాహుబ‌లి ని క‌లెక్ష‌న్ల ప‌రంగా ఓవ‌ర్ టేక్ చేయాలంటే.. ఎవ‌రైన బాహుబ‌లి ని మించిన సినిమా ను చేస్తే త‌ప్ప అది సాధ్య ప‌డదు మ‌రి.అప్ప‌టి వ‌ర‌కు మెగా హీరోలే కాదు..ఎవ‌రైన ఒక్క‌టే….!

First Published:  28 July 2015 5:01 PM GMT
Next Story