Telugu Global
Cinema & Entertainment

మనీషా కొయిరాలా రీఎంట్రీ

క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న మనీషా కొయిరాలా ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ నేపాలీ బ్యూటీ, ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. తమిళ్ లో ఇప్పటికే ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. శ్యామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో  కనిపిస్తోంది మనీషా. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం బ్యాంకాంక్ లో షూటింగ్ జరుగుతోంది.శ్యామ్-మనీషా మధ్య […]

మనీషా కొయిరాలా రీఎంట్రీ
X
క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న మనీషా కొయిరాలా ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ నేపాలీ బ్యూటీ, ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. తమిళ్ లో ఇప్పటికే ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. శ్యామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది మనీషా. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం బ్యాంకాంక్ లో షూటింగ్ జరుగుతోంది.శ్యామ్-మనీషా మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడి భార్య ఎలా చనిపోయింది.. ఆ మరణం వెనుక మిస్టరీ ఎంటనే కథాశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాలో పొలిటీషియన్ భార్యగా మనీషా కొయిరాలా నటిస్తోంది. ఇళయరాజా ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే తెలుగులో కూడా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతోంది మనీషా కొయిరాలా. ఇప్పటికే నాగార్జున, కృష్ణవంశీ లాంటి ప్రముఖులతో టచ్ లో ఉంది మనీషా. త్వరలోనే వాళ్ల కొత్త సినిమాల్లో ఏమైనా కీలకపాత్రల్లో కనిపించే అవకాశముంది. రీఎంట్రీలో కూడా మనీషా ఆకట్టుకోవాలని ఆశిద్దాం.
First Published:  28 July 2015 7:00 PM GMT
Next Story