Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ లోకి ఓకే బంగారం

మణిరత్నం ఆవిష్కరించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఓకే బంగారం. అప్పట్లో ఈ సినిమా క్లీన్ హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీలోకి కూడా రీమేక్ అవుతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఇన్నాళ్లకు ఓకే బంగారం రీమేక్ పై ఓ క్లారిటీ వచ్చింది. తన ప్రతి సినిమా రీమేక్ ను తానే హ్యాండిల్ చేసే మణిరత్నం.. ఈసారి మాత్రం ఆ బాధ్యతల్ని తన శిష్యుడు షాద్ అలీకి అప్పగించాడు. ఓకే బంగారం హిందీ రీమేక్ కు షాద్ అలీ దర్శకత్వం […]

బాలీవుడ్ లోకి ఓకే బంగారం
X
మణిరత్నం ఆవిష్కరించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఓకే బంగారం. అప్పట్లో ఈ సినిమా క్లీన్ హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీలోకి కూడా రీమేక్ అవుతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఇన్నాళ్లకు ఓకే బంగారం రీమేక్ పై ఓ క్లారిటీ వచ్చింది. తన ప్రతి సినిమా రీమేక్ ను తానే హ్యాండిల్ చేసే మణిరత్నం.. ఈసారి మాత్రం ఆ బాధ్యతల్ని తన శిష్యుడు షాద్ అలీకి అప్పగించాడు. ఓకే బంగారం హిందీ రీమేక్ కు షాద్ అలీ దర్శకత్వం వహిస్తాడు. అటు ఈ సినిమాలో నటించే హీరోహీరోయిన్లను కూడా ఫైనలైజ్ చేశాడు మణిరత్నం. సౌత్ లో దుల్కర్ సుమన్ చేసిన పాత్రను హిందీలో ఆదిత్య రాయ్ కపూర్, నిత్యామీనన్ చేసిన పాత్రను సోనాక్షి సిన్హా పోషించబోతున్నారు. ఈ మేరకు నటీనటుల కాంట్రాక్ట్ కూడా పూర్తయింది. ఈ హిందీ రీమేక్ ను మణిరత్నమే నిర్మించబోతున్నాడు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా మణిరత్నమే చేయబోతున్నాడు. ఆగస్ట్ ఎండింగ్ నుంచి హిందీలో ఓకే బంగారం రీమేక్ షూటింగ్ స్టార్టవుతుంది.
First Published:  28 July 2015 7:03 PM GMT
Next Story