Telugu Global
Others

త‌లోదారిలో శ్రీకాకుళం త‌మ్ముళ్లు

తెలుగుదేశం కంచుకోట‌లో బాట‌లు వేర‌వుతున్నాయి. త‌మ్ముళ్ల రూటు సెప‌రేట‌వుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి  శ్రీకాకుళం జిల్లా..ఆ పార్టీకి పెట్ట‌ని కోట‌.  వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాం ప్రారంభం అయ్యేవ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి. 2004 ఎన్నిక‌ల్లో రాజ‌న్న వైపు మొగ్గుచూపింది చిక్కోలు జిల్లా. 2009 ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌దే పైచేయి. మ‌హానేత మ‌ర‌ణంతో కాంగ్రెస్ ప్ర‌భ మ‌స‌క‌బారింది. 2014 ఎన్నిక‌లు వైఎస్ఆర్సీ..టీడీపీ మ‌ధ్య హోరాహోరీగా సాగాయి. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో 7 టీడీపీ, 3 వైఎస్సార్పీపీ గెలుచుకున్నాయి. ఎంపీ స్థానమూ […]

త‌లోదారిలో శ్రీకాకుళం త‌మ్ముళ్లు
X
తెలుగుదేశం కంచుకోట‌లో బాట‌లు వేర‌వుతున్నాయి. త‌మ్ముళ్ల రూటు సెప‌రేట‌వుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా..ఆ పార్టీకి పెట్ట‌ని కోట‌. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాం ప్రారంభం అయ్యేవ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి. 2004 ఎన్నిక‌ల్లో రాజ‌న్న వైపు మొగ్గుచూపింది చిక్కోలు జిల్లా. 2009 ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌దే పైచేయి. మ‌హానేత మ‌ర‌ణంతో కాంగ్రెస్ ప్ర‌భ మ‌స‌క‌బారింది. 2014 ఎన్నిక‌లు వైఎస్ఆర్సీ..టీడీపీ మ‌ధ్య హోరాహోరీగా సాగాయి. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో 7 టీడీపీ, 3 వైఎస్సార్పీపీ గెలుచుకున్నాయి. ఎంపీ స్థానమూ టీడీపీ ఖాతాలోకే చేరింది. ఈ ఫ‌లితాలు ఇచ్చిన ఉత్సాహంతో చిక్కోలును టీడీపీ కంచుకోట‌గా పున‌ర్నిర్మించేందుకు అధినేత చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదు. అయితే అన్ని విక‌టించాయి. కంచుకోట త‌రువాత‌..ఉన్న కోట‌కు బీట‌లు వారే దుస్థితి ఏర్ప‌డింద‌ని త‌మ్ముళ్లు తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు. జిల్లాలో ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు ప‌దిహేడు గ్రూపులుగా తెలుగుదేశంలో వ‌ర్గ‌పోరు ఊపందుకుంది. జిల్లాకు చెందిన ఏకైక మంత్రి అచ్చెన్నాయుడు చంద్ర‌బాబుకు అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన నేత‌గా మార‌డంతో..పార్టీలో సీనియ‌ర్లు కినుక వ‌హించారు. జిల్లా రాజ‌కీయాల‌ను అచ్చెన్న అన్నీ తానై న‌డిపిస్తున్నారు. దివంగ‌త నేత, త‌న అన్న అయిన ఎర్ర‌న్న త‌న‌యుడు..శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడి మాట కూడా చెల్ల‌ని ప‌రిస్థితి ఉందంటే ..అచ్చెన్న హ‌వా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌తంలో ఎర్ర‌న్నాయుడితో విభేదాలున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి క‌ళా వెంక‌ట‌రావు.. అచ్చెన్నాయుడితోనూ కోల్డ్‌వార్ కొన‌సాగిస్తున్నారు. మ‌రో వైపు మాజీ స్పీక‌ర్ ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తి, కిమిడి క‌ళా వెంక‌ట‌రావుల‌కు నియోజ‌క‌వ‌ర్గ మార్పుతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారి ఇద్ద‌రి మ‌ధ్యా పూడ్చ‌లేనంత అగాథం ఏర్ప‌డింది. క‌ళా కోట‌లాంటి ఉణుకూరు నియోజ‌క‌వ‌ర్గం..పున‌ర్విభ‌జ‌న‌
లో రాజాంగా పేరు మారి ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయ్యింది. ఇక్క‌డి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీచేసిన ప్ర‌తిభ స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మ‌రోవైపు గ‌తంలో ప్ర‌తిభ ప్రాతినిధ్యం వ‌హించిన ఎచ్చెర్ల జ‌న‌ర‌ల్‌గా మార‌డంతో అక్క‌డి నుంచి పోటీచేసి క‌ళావెంక‌ట‌రావు గెలుపొందారు. త‌న ఓట‌మికి క‌ళావెంక‌ట‌రావే కార‌ణ‌మ‌ని ప్ర‌తిభాభార‌తి తీవ్ర మ‌న‌స్తాపం చెందార‌ట‌. క‌ళాకు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చెక్‌పెట్టాలంటే.. అచ్చెన్న‌ను ఆశ్ర‌యించక త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన ప్ర‌తిభా భార‌తి .. మంత్రి గ్రూపులో మెంబ‌ర‌య్యార‌ట‌. మ‌రో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి, గౌతు ల‌చ్చ‌న్న త‌న‌యుడు, ప్ర‌స్తుత ప‌లాస ఎమ్మెల్యే అయిన గౌతు శ్యాం సుంద‌ర్ శివాజీ కూడా అచ్చెన్న‌తో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్నార‌ట‌. ఇక న‌ర‌స‌న్న‌పేట ఎమ్మెల్యే బ‌గ్గు ర‌మ‌ణ‌మూర్తి..తన నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు హ‌వా సాగుతోంద‌ని తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని..శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత‌లు త‌మ ప్రైవేట్ సంభాష‌ణ‌ల్లో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ..ఇత‌ర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేత‌ల‌ను చేర్చుకునే శ్ర‌ద్ధ పార్టీపై పెట్టి ఉంటే..టీడీపీ బ‌లోపేత‌మ‌య్యేద‌ని స్థానిక నేత‌లు విశ్లేషిస్తున్నారు.
First Published:  28 July 2015 1:10 PM GMT
Next Story