Telugu Global
Cinema & Entertainment

బాహుబలి 2 లో బాలీవుడ్ నటులే ఎక్కువ... ?

రాజమౌళి సృష్టించిన బాహుబలి సినిమా సూపర్ హిట్టయింది. దీంతో బాహుబలి-2పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈసారి బాహుబలి-2 సినిమా రాజమౌళి చేయి దాటిపోయింది. ఈ సినిమాలో ఈసారి భారీ మార్పులు తప్పేట్టు లేవు. జక్కన్నకు ఇష్టంలేకపోయినా కొన్ని మార్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా ఈ సినిమాకు బాలీవుడ్ కలరింగ్ ఇవ్వమని ఆదేశించాడట కరణ్ జోహార్. మొదటి భాగంలో బాలీవుడ్ ఫ్లేవర్ లేకపోయినప్పటికీ కలెక్షన్లు అదిరిపోయాయి కాబట్టి.. రెండో భాగంలో బాలీవుడ్ నటీనటుల్ని పెడితే వసూళ్లు ఇంకా […]

బాహుబలి 2 లో బాలీవుడ్ నటులే ఎక్కువ... ?
X
రాజమౌళి సృష్టించిన బాహుబలి సినిమా సూపర్ హిట్టయింది. దీంతో బాహుబలి-2పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈసారి బాహుబలి-2 సినిమా రాజమౌళి చేయి దాటిపోయింది. ఈ సినిమాలో ఈసారి భారీ మార్పులు తప్పేట్టు లేవు. జక్కన్నకు ఇష్టంలేకపోయినా కొన్ని మార్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా ఈ సినిమాకు బాలీవుడ్ కలరింగ్ ఇవ్వమని ఆదేశించాడట కరణ్ జోహార్. మొదటి భాగంలో బాలీవుడ్ ఫ్లేవర్ లేకపోయినప్పటికీ కలెక్షన్లు అదిరిపోయాయి కాబట్టి.. రెండో భాగంలో బాలీవుడ్ నటీనటుల్ని పెడితే వసూళ్లు ఇంకా బాగుంటాయని అభిప్రాయపడ్డాడు. అంతకేాదు.. కుదిరితే బాలీవుడ్ నటుల కోసం కథలో మార్పులు చేయమని కరణ్ డిమాండ్ చేస్తున్నాడట. మంచి క్యారెక్టర్లు సృష్టిస్తే, అవసరమైతే స్టార్లతో తను మాట్లాడతానని కూడా హామీ ఇచ్చాడట. దీంతో పార్ట్-2లో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాజమౌళికి.
మరోవైపు తనే ఇష్టపడి ఇప్పటికే కొన్ని మార్పులు చేశాడు రాజమౌళి. సినిమాలో రమ్యకృష్ణ పాత్ర నిడివి పెంచాడు. తమన్న పాత్రను దాదాపు కట్ చేశాడు. పార్ట్-2లో రొమాంటిక్ సీన్లు కూడా తగ్గించేసి, యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇప్పుడు తాజా వత్తిళ్ల ప్రకారం బాలీవుడ్ నటీనటులతో కోసం కూడా కొత్త పాత్రలు సృష్టించుకోవాల్సి వస్తోంది. సో.. బాహుబలి పార్ట్-2లో బాలీవుడ్ స్టార్స్ ను కూడా మనం చూడబోతున్నాం.
First Published:  29 July 2015 7:01 PM GMT
Next Story