Telugu Global
NEWS

ఏభై ఏళ్ల కరెంట్‌ బిల్లుల ఎగ‌వేత 'దారి' బంద్‌

 క‌రెంట్ బిల్లుల ఎగ‌వేత‌లో వారిది 50 ఇయ‌ర్స్ ఇండ‌స్ర్టీ సీనియారిటీ. తెలంగాణ ప్ర‌భుత్వం దృష్టి సారించ‌డంతో ఎట్ట‌కేల‌కు ఏభై ఏళ్ల త‌రువాత తొలిసారిగా వారంతా క‌రెంట్ బిల్లు చెల్లించాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. న‌ల్గొండ జిల్లాలో నాగార్జున‌సాగ‌ర్ డ్యామ్ క‌ట్టిన‌ప్పుడు ఏర్ప‌డిన నాగార్జున సాగ‌ర్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ అన‌ధికారికంగా విద్యుత్‌ను వాడుకుంటున్నారు. 4200 ఇళ్లున్న సాగ‌ర్ ప‌ట్ట‌ణం క‌రెంట్ అవ‌స‌రాల‌కు ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వం 22 కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తోంది. గ‌త ఏడాది గృహాస‌రాల విద్యుత్‌కు రూ.22 కోట్లు,   […]

ఏభై ఏళ్ల కరెంట్‌ బిల్లుల ఎగ‌వేత దారి బంద్‌
X
క‌రెంట్ బిల్లుల ఎగ‌వేత‌లో వారిది 50 ఇయ‌ర్స్ ఇండ‌స్ర్టీ సీనియారిటీ. తెలంగాణ ప్ర‌భుత్వం దృష్టి సారించ‌డంతో ఎట్ట‌కేల‌కు ఏభై ఏళ్ల త‌రువాత తొలిసారిగా వారంతా క‌రెంట్ బిల్లు చెల్లించాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. న‌ల్గొండ జిల్లాలో నాగార్జున‌సాగ‌ర్ డ్యామ్ క‌ట్టిన‌ప్పుడు ఏర్ప‌డిన నాగార్జున సాగ‌ర్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ అన‌ధికారికంగా విద్యుత్‌ను వాడుకుంటున్నారు. 4200 ఇళ్లున్న సాగ‌ర్ ప‌ట్ట‌ణం క‌రెంట్ అవ‌స‌రాల‌కు ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వం 22 కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తోంది. గ‌త ఏడాది గృహాస‌రాల విద్యుత్‌కు రూ.22 కోట్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా విద్యుత్ కోసం రూ.9 కోట్లు, వీధిదీపాల విద్యుత్‌కు రూ.3 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌యిన‌ట్లు గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. నీటిపారుద‌ల‌శాఖ‌కు చెందిన స్థ‌లాల‌ను క‌బ్జా చేసి ఇళ్లు క‌ట్టుకొని కొంద‌రు, ప్రాజెక్ట్ క్వార్ట‌ర్స్ ఆక్ర‌మించుకుని మ‌రికొంద‌రు నివ‌సిస్తున్నారు. వీరంతా మీట‌ర్లు లేకుండానే అన‌ధికారిక క‌నెక్ష‌న్ల ద్వారా విద్యుత్ వాడుకుంటున్నారు. ద‌శాబ్దాలుగా సాగుతున్న ఈ దోపిడీకి చెక్‌పెట్టేందుకు తెలంగాణ స‌ర్కార్ న‌డుం బిగించింది. సాగ‌ర్ ఊరులో ఉన్న ప్ర‌తి ఇంటికీ విద్యుత్ మీట‌ర్‌ను బిగించే ప‌నుల‌ను ప్రారంభించారు. ఇది చాలావ‌ర‌కూ పూర్త‌య్యింది. వ‌చ్చే నెల నుంచి వీరంతా క‌రెంట్ మ‌ళ్లీ ఠంచ‌న్‌గా క‌ట్ట‌క‌పోతే క‌నెక్ష‌న్ క‌ట్ కావ‌డం ఖాయం అంటున్నారు అధికారులు. అన‌ధికారిక క‌నెక్ష‌న్ల‌కు మీట‌ర్లు అమ‌ర్చ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వ ఖ‌జానాకు ఏటా రూ.22 కోట్లు ఆదా కానుంద‌ని అంచ‌నా.
First Published:  30 July 2015 3:03 AM GMT
Next Story