Telugu Global
Cinema & Entertainment

హాస్పిటల్ పాలైన అస్లామ్ ఖాన్

బాహుబలి సినిమాలో అస్లామ్ ఖాన్ గా మెప్పించిన సుధీప్ హాస్పిటల్ లో చేరాడు. కొంత కాలంలో తీవ్రమైన అసిడిటీ, వెన్నునొప్పి, మెగ్రెయిన్ లాంటి ఇబ్బందులతో బాధపడుతున్నాడు సుదీప్. తాజాగా ఇవన్నీ ఒకేసారి తిరగబెట్టడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో సుదీప్ ను జాయిన్ చేశారు. డాక్టర్లు 2 రోజుల పాటు సుదీప్ ను హాస్పిటల్ లోనే ఉండమని సూచించారట. దీంతో సుదీప్ సినిమాలకు 2 రోజుల పాటు బ్రేక్ పడింది. రాజమౌళి తీసిన ఈగ సినిమాతో […]

హాస్పిటల్ పాలైన అస్లామ్ ఖాన్
X
బాహుబలి సినిమాలో అస్లామ్ ఖాన్ గా మెప్పించిన సుధీప్ హాస్పిటల్ లో చేరాడు. కొంత కాలంలో తీవ్రమైన అసిడిటీ, వెన్నునొప్పి, మెగ్రెయిన్ లాంటి ఇబ్బందులతో బాధపడుతున్నాడు సుదీప్. తాజాగా ఇవన్నీ ఒకేసారి తిరగబెట్టడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో సుదీప్ ను జాయిన్ చేశారు. డాక్టర్లు 2 రోజుల పాటు సుదీప్ ను హాస్పిటల్ లోనే ఉండమని సూచించారట. దీంతో సుదీప్ సినిమాలకు 2 రోజుల పాటు బ్రేక్ పడింది. రాజమౌళి తీసిన ఈగ సినిమాతో తెలుగునాట పాపులర్ అయ్యాడు సుదీప్. ఆ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. తాజాగా రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో కూడా అస్లామ్ ఖాన్ పాత్రలో కనిపించాడు. సినిమాలో సుదీప్ పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయినప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది. బాహుబలి పార్ట్-2లో మరిన్ని ఎక్కువ సీన్లు ఉండే అవకాశముంది. అటు కన్నడనాట కూడా సుదీప్ బిజీ అయిపోయాడు. తెలుగులో హిట్టయిన అత్తారింటికి దారేది సినిమాను కన్నడలో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇలా రెండు భాషల్లో బిజీబిజీగా ఉన్న టైమ్ లో ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యాడు సుదీప్.
First Published:  29 July 2015 7:05 PM GMT
Next Story