Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ క్వీన్ క‌త్తి ప‌ట్టింది..!

కంగ‌న కు అన్ని మంచి రోజులే .  అఫ్ కోర్స్  వ్య‌క్తిగా.. న‌టిగా త‌న బోల్డ్ నెస్  ఎమిటో  బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ కు తెలుసు.  అవ‌కాశాల కోసం  ఎవ‌రికీ స‌లాం కొట్టే ర‌కం కాదు కంగనా. ఏ విష‌యం అయిన కుండ బ‌ద్ద‌లు కొట్టినట్టేమాట్లాడుతుంది. ఎదుట వ్య‌క్తి  ఎంత‌టి స్థాయిలో వున్న  తేడా వ‌స్తే   మాట‌లు తూటాలు పేల్చ‌డానికి ఏ మాత్రం  వెన‌కాడ‌దు.  ఇక న‌టిగా   గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి ఉన్న‌ఈ […]

బాలీవుడ్ క్వీన్ క‌త్తి ప‌ట్టింది..!
X
కంగ‌న కు అన్ని మంచి రోజులే . అఫ్ కోర్స్ వ్య‌క్తిగా.. న‌టిగా త‌న బోల్డ్ నెస్ ఎమిటో బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ కు తెలుసు. అవ‌కాశాల కోసం ఎవ‌రికీ స‌లాం కొట్టే ర‌కం కాదు కంగనా. ఏ విష‌యం అయిన కుండ బ‌ద్ద‌లు కొట్టినట్టేమాట్లాడుతుంది. ఎదుట వ్య‌క్తి ఎంత‌టి స్థాయిలో వున్న తేడా వ‌స్తే మాట‌లు తూటాలు పేల్చ‌డానికి ఏ మాత్రం వెన‌కాడ‌దు.
ఇక న‌టిగా గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి ఉన్న‌ఈ హ‌ర్యానా బ్యూటీ రెంజ్ ఇప్పుడు బాగా పెరిగింది. క్వీన్ చిత్రంతో న‌టిగా త‌న సత్తాను చాటింది. ఈ మ‌ధ్య వ‌చ్చిన త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్ తో వాణిజ్య ప‌రంగా త‌న స‌త్తాను చాటుకుంది. దీంతో కంగ‌న తో స్పెష‌ల్ రోల్స్ చేయించ‌డానికి బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ పోటి ప‌డుతున్నారు. ఆ మ‌ధ్య ఝాన్సి ల‌క్ష్మి బాయ్ జీవిత క‌థ‌ను ఆధారంగా ఒక చిత్రం చేస్తున్నార‌నే టాక్ వినిపించింది. ఇందులో మెయిన్ లీడ్ కంగ‌న చేస్తున్న‌ట్లు టాక్ . ఇక తాజాగా రంగూన్ అనే ఒక చిత్రం చేయ‌డానికి కంగ‌న గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఈ చిత్రం బ్రాడ్ వే థియేట‌ర్స్ అనే డ్రామా కంపెని చుట్టు తిరుగుతుంది. సంజ‌య్ ద‌త్ లీడ్ రోల్ చేస్తుండ‌గా.. ఆయ‌న వైఫ్ రోల్ లో కంగ‌న చేస్తుంద‌ట‌. కథా ప‌రంగా కంగ‌న రనౌత్ చేసే జులియా పాత్ర కు కత్తి యుద్దాలు..గుర్ర‌పు స్వారీలు తెలిసి వుండాలట‌. దీంతో ద‌ర్శ‌కుడు విశాల్ భ‌రద్వాజ్ .. కేర‌ళ నుంచి శిక్ష‌కుల‌ను పిలిపించి కంగ‌న‌కు హ‌ర్స్ రైడింగ్.. క‌త్తి ఫైటింగ్స్ లో ట్రైనింగ్ ఇవ్వ‌డం ప్రారంభించార‌ట . మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు నార్మ‌ల్ రోల్స్ తోనే మెప్పించి జాతీయ ఉత్త‌మ న‌టి అనిపించుకుంది. మ‌రి త‌ను చెల‌రేగ‌టానికి స్కోప్ వున్న రోల్ చేస్తుంది . మ‌రెంత‌గా అభిమానుల హృద‌యాల్ని కొల్ల‌గొడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
First Published:  30 July 2015 12:00 AM GMT
Next Story