Telugu Global
Cinema & Entertainment

ఖల్ నాయక్  జైలులోనే పుట్టినరోజు వేడుక... 

ప్రస్తుతం సంజయ్ దత్ జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో సంజయ్ దత్ కు కోర్టు 42 నెలల జైలుశిక్ష విధించింది. జైలుకు వెళ్లిన తర్వాత తొలిసారి తన పుట్టినరోజును జరుపుకున్నాడు సంజయ్ దత్. ప్రతిసారి ముంబయిలో అట్టహాసంగా జరిగే పుట్టినరోజు వేడుక ఈసారి మాత్రం చాలా సాదాసీదాగా జరిగింది. పూనెలోని ఎరవాడ జైలులో ఉన్న సంజయ్ దత్ ను ఆమె భార్య మాన్యత కలిసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు […]

ఖల్ నాయక్  జైలులోనే పుట్టినరోజు వేడుక... 
X
ప్రస్తుతం సంజయ్ దత్ జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో సంజయ్ దత్ కు కోర్టు 42 నెలల జైలుశిక్ష విధించింది. జైలుకు వెళ్లిన తర్వాత తొలిసారి తన పుట్టినరోజును జరుపుకున్నాడు సంజయ్ దత్. ప్రతిసారి ముంబయిలో అట్టహాసంగా జరిగే పుట్టినరోజు వేడుక ఈసారి మాత్రం చాలా సాదాసీదాగా జరిగింది. పూనెలోని ఎరవాడ జైలులో ఉన్న సంజయ్ దత్ ను ఆమె భార్య మాన్యత కలిసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పిల్లల తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసింది. తర్వాత జైలులోనే ఓ చిన్నపాటి పార్టీలాంటిది ఎరేంజ్ చేశారు జైలు అధికారులు. తన తోటి ఖైదీలతో కలిసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు సంజయ్ దత్. వాళ్లందరికీ మాన్యత తెచ్చిపెట్టిన స్వీట్లు పంచాడు. జైల్లో పోలీసులకు కూడా మిఠాయిలు తినిపించాడు. ఈ తతంగం అంతా దాదాపు ఒక గంటపాటు నడిచింది. తర్వాత మళ్లీ తన పనిలో పడిపోయాడు సంజయ్ దత్. ఖల్ నాయక్ ప్రతి పుట్టినరోజుకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పే చాలామంది సెలబ్రిటీలు ఈసారి ఏకంగా ఆయన బర్త్ డేను మరిచిపోవడం విశేషం.
First Published:  29 July 2015 7:04 PM GMT
Next Story