Telugu Global
Cinema & Entertainment

ర‌కుల్ కోసం 3 గంట‌లు రోడ్డు మూసివేత‌!

న‌గ‌రంలో మెట్రో ప‌నులతో వాహ‌న‌దారులు ఇప్ప‌టికే తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా ఏకంగా పోలీసులే వీఐపీల కోసం రోడ్డును మూసివేస్తే వాహ‌న‌దారుల గ‌తేం కాను? తాజాగా హైద‌రాబాద్ లో ఎస్ ఆర్ న‌గ‌ర్‌లో బ‌హార్ కేఫ్ ప్రారంభంలో ఇదే సీన్ క‌నిపించింది. బ‌హార్ కేఫ్ ఓపెనింగ్ కోసం హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ బుధ‌వారం వ‌చ్చారు. ఆమె వ‌స్తున్నార‌ని తెలిసి పోలీసులు ఆ ప్రాంతంలో  3 గంట‌ల‌పాటు రోడ్డు మూసివేశారు. దీంతో వాహ‌న‌దారులు ఎంతో ఇబ్బంది ప‌డ్డారు. […]

ర‌కుల్ కోసం 3 గంట‌లు రోడ్డు మూసివేత‌!
X
న‌గ‌రంలో మెట్రో ప‌నులతో వాహ‌న‌దారులు ఇప్ప‌టికే తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా ఏకంగా పోలీసులే వీఐపీల కోసం రోడ్డును మూసివేస్తే వాహ‌న‌దారుల గ‌తేం కాను? తాజాగా హైద‌రాబాద్ లో ఎస్ ఆర్ న‌గ‌ర్‌లో బ‌హార్ కేఫ్ ప్రారంభంలో ఇదే సీన్ క‌నిపించింది. బ‌హార్ కేఫ్ ఓపెనింగ్ కోసం హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ బుధ‌వారం వ‌చ్చారు. ఆమె వ‌స్తున్నార‌ని తెలిసి పోలీసులు ఆ ప్రాంతంలో 3 గంట‌ల‌పాటు రోడ్డు మూసివేశారు. దీంతో వాహ‌న‌దారులు ఎంతో ఇబ్బంది ప‌డ్డారు. తీరా కార‌ణం తెలుసుకున్న వాహ‌న‌దారులు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిప‌డ్డారు. హీరోయిన్ వ‌స్తే..ఏకంగా రోడ్డు మూసేయ‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయం అంటూ తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేశారు.
First Published:  29 July 2015 7:10 PM GMT
Next Story