Telugu Global
Others

లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌

లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాపయ్యారు. వీరిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. మరో ఇద్దరు లక్ష్మీకాంత్‌, విజయకుమార్‌లు కర్ణాటక వాసులుగా తెలుస్తోంది. తెలుగువారిద్దరినీ గోపీకృష్ణగాను, బలరామ్‌గాను గుర్తించారు. వీరు ఏడేళ్ళుగా లిబియాలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. బలరామ్‌ హైదరాబాద్‌కు, గోపీకృష్ణ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వారుగా తెలిసింది. బుధవారం విధులకు వెళుతున్న సమయంలో కారు డ్రైవర్‌ని మద్యలోనే దింపేసి వీరిని కిడ్నాపర్లు అపహరించినట్టు తెలుస్తోంది. కిడ్నాపింగ్‌పై భారత హోం శాఖ దృష్టి పెట్టింది. తన భర్తను లిబియాలో […]

లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌
X
లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాపయ్యారు. వీరిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. మరో ఇద్దరు లక్ష్మీకాంత్‌, విజయకుమార్‌లు కర్ణాటక వాసులుగా తెలుస్తోంది. తెలుగువారిద్దరినీ గోపీకృష్ణగాను, బలరామ్‌గాను గుర్తించారు. వీరు ఏడేళ్ళుగా లిబియాలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. బలరామ్‌ హైదరాబాద్‌కు, గోపీకృష్ణ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వారుగా తెలిసింది. బుధవారం విధులకు వెళుతున్న సమయంలో కారు డ్రైవర్‌ని మద్యలోనే దింపేసి వీరిని కిడ్నాపర్లు అపహరించినట్టు తెలుస్తోంది. కిడ్నాపింగ్‌పై భారత హోం శాఖ దృష్టి పెట్టింది. తన భర్తను లిబియాలో కిడ్నాప్‌ చేసిన మాట నిజమేనని గోపీకృష్ణ భార్య కల్యాణి తెలిపారు. కిడ్నాపైన వారిని విడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కల్యాణి కోరారు. బందీలను విడిపించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని బాధితుల కుటుంబసభ్యులతో ఎంబసీ అధికారులు చెప్పారు. అధికారులు బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు.
First Published:  31 July 2015 2:13 AM GMT
Next Story