Telugu Global
Others

బంగారు కొండ‌లు... భార‌తీయులు

ఔను నిజ‌మే! భార‌తీయులు నిజంగా బంగారు కొండ‌లే. ఈ విష‌యాన్ని సాక్షాత్తూ ప్ర‌పంచ బంగారు కౌన్సిల్ (డ‌బ్ల్యూజీసీ ) స్వ‌యంగా ప్ర‌క‌టించింది. భార‌తీయుల వ‌ద్ద దాదాపు 22 వేల ట‌న్నుల బంగారం నిల్వ ఉండ‌డ‌మే కాకుండా ప్ర‌తి యేటా 600 ట‌న్నుల బంగారాన్ని ఆభ‌ర‌ణాల త‌యారీకి కొనుగోలు చేస్తున్నారని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. భార‌తీయ మ‌హిళ‌ల‌కు బంగారు ఆభ‌ర‌ణాలంటే త‌గ‌ని ప్రీతి. బంగారు న‌గ‌ల‌ను అమితంగా ప్రేమిస్తారు. అంతేకాదు బంగారాన్ని పెట్టుబ‌డిగా కూడా భావిస్తారు. అందుకే భార‌తీయుల […]

బంగారు కొండ‌లు... భార‌తీయులు
X

ఔను నిజ‌మే! భార‌తీయులు నిజంగా బంగారు కొండ‌లే. ఈ విష‌యాన్ని సాక్షాత్తూ ప్ర‌పంచ బంగారు కౌన్సిల్ (డ‌బ్ల్యూజీసీ ) స్వ‌యంగా ప్ర‌క‌టించింది. భార‌తీయుల వ‌ద్ద దాదాపు 22 వేల ట‌న్నుల బంగారం నిల్వ ఉండ‌డ‌మే కాకుండా ప్ర‌తి యేటా 600 ట‌న్నుల బంగారాన్ని ఆభ‌ర‌ణాల త‌యారీకి కొనుగోలు చేస్తున్నారని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. భార‌తీయ మ‌హిళ‌ల‌కు బంగారు ఆభ‌ర‌ణాలంటే త‌గ‌ని ప్రీతి. బంగారు న‌గ‌ల‌ను అమితంగా ప్రేమిస్తారు. అంతేకాదు బంగారాన్ని పెట్టుబ‌డిగా కూడా భావిస్తారు. అందుకే భార‌తీయుల వ‌ద్ద అత్య‌ధిక మొత్తంలో బంగారు నిల్వ‌లుంటున్నాయ‌ని డ‌బ్ల్యూజీసీ ప్ర‌క‌టించింది. అయితే, ఈసంస్థ నివేదిక ప్ర‌కారం భార‌త్‌లో 30 శాతం కంటే త‌క్కువ బంగారం మాత్ర‌మే హాల్ మార్క్ ధ్రువీక‌ర‌ణ పొందుతోంది. అయినా విదేశాల్లో భార‌త్‌ బంగారం ప‌ట్ల విశ్వాసం పెరుగుతోంద‌ని, ప్ర‌భుత్వం క‌నుక క‌ఠిన‌మైన‌, స్థిర‌మైన దేశీయ ప‌థ‌కాల ద్వారా ప్ర‌స్తుతం ఉన్న 8 బిలియ‌న్ల డాల‌ర్ల స్థాయి నుంచి 40 బిలియ‌న్ల డాల‌ర్ల ఎగుమ‌తికి ఇండియా చేరుకోవ‌చ్చ‌ని డ‌బ్ల్యూజీసీ ప్ర‌క‌టించింది. అయితే ఇండియాలో పెద్ద‌ న‌గ‌ల‌కే హాల్‌మార్క్ ద్రువీక‌ర‌ణ ఉంటోంద‌ని అది కూడా చాలా త‌క్కువ స్థాయిలో ఉంటోంద‌ని డ‌బ్ల్యూజీసీ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న స్వ‌తంత్ర హాల్‌మార్కింగ్ విధానాన్ని కొన‌సాగించ‌డంతోపాటు హాల్‌మార్క్ బంగారం శాతం పెరిగేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆసంస్థ సూచించింది. హాల్‌మార్క్‌ కేంద్రాల చుట్టు ఉన్న పాల‌నాప‌ర‌మైన వ‌ల‌యాన్ని బ‌లోపేతం చేయ‌డం, వినియోగ‌దారుల‌కు హాల్‌మార్క్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, హాల్‌మార్క్ కేంద్రాల‌ను విస్త‌రింప చేయ‌డం ద్వారా భార‌తీయ బంగారం నాణ్య‌త పెరుగుతుంద‌ని ఆసంస్థ సూచించింది. దేశంలో అత్య‌ధిక హాల్‌మార్క్ కేంద్రాలు త‌మిళ‌నాడులోనే ఉన్నాయి. ఆ త‌ర్వాత స్థానంలో కేర‌ళ ఉంద‌ని వీటి సంఖ్య‌ను ఇతర రాష్ట్రాల్లో కూడా పెంచాల‌ని నివేదిక‌లో సూచించింది.

First Published:  31 July 2015 1:17 AM GMT
Next Story