Telugu Global
Cinema & Entertainment

కిక్-2 రిలీజ్ ఇప్పుడు ఖరారైంది

రవితేజ-రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా కిక్-2. లెక్క ప్రకారం ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఈ పాటికి నెలరోజులు దాటాల్సింది. కానీ బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో కిక్-2 రిలీజ్ వాయిదా పడింది. మరోవైపు సినిమాలో చాలా సన్నివేశాల్ని రీషూట్ చేయడంతో వాయిదా అనివార్యమైంది. దీంతో ఆగస్ట్ లో కిక్-2ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా తాజాగా విడుదలైంది. అయితే ఆగస్ట్ లో […]

కిక్-2 రిలీజ్ ఇప్పుడు ఖరారైంది
X
రవితేజ-రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా కిక్-2. లెక్క ప్రకారం ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఈ పాటికి నెలరోజులు దాటాల్సింది. కానీ బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో కిక్-2 రిలీజ్ వాయిదా పడింది. మరోవైపు సినిమాలో చాలా సన్నివేశాల్ని రీషూట్ చేయడంతో వాయిదా అనివార్యమైంది. దీంతో ఆగస్ట్ లో కిక్-2ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా తాజాగా విడుదలైంది. అయితే ఆగస్ట్ లో ఏ తేదీన విడుదల చేస్తారనే సమాచారం మాత్రం సినిమా యూనిట్ అందించలేదు. ఎఫ్ ఎం రేడియో వేదికగా ఆ డేట్ ను కూడా ఇప్పుడు ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 21న కిక్-2ను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఓ ఎఫ్ ఎం రేడియోలో కిక్-2 సినిమాకు సంబంధించిన యాప్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రవితేజ పాల్గొన్నాడు. అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. కిక్-2 సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్, కిక్-2 సినిమాను నిర్మించాడు. తమన్ అందించిన బాణీలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
First Published:  30 July 2015 7:03 PM GMT
Next Story