Telugu Global
Cinema & Entertainment

మరో క్రేజీ మూవీ రెడీ చేసింది

ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓసారి నటించింది సమంత. విలక్షణ సినిమాలు తీయడంలో దిట్టగా పేరుతెచ్చుకున్న విక్రమ్ కుమార్, సమంతను హీరోయిన్ గా తీసుకొని మనం సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా తెలుగునాట మంచి విజయం సాధించింది. ఆ వెంటనే సూర్యతో కలిసి సినిమా స్టార్ట్ చేశాడు విక్రమ్ కుమార్. ఇది కూడా ఓ విభిన్నమైన కథాంశమే. ఈ సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ గా తీసుకున్నాడు విక్రమ్ కుమార్. అలా సూర్య-సమంత కాంబినేషన్ లో రెండో […]

మరో క్రేజీ మూవీ రెడీ చేసింది
X
ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓసారి నటించింది సమంత. విలక్షణ సినిమాలు తీయడంలో దిట్టగా పేరుతెచ్చుకున్న విక్రమ్ కుమార్, సమంతను హీరోయిన్ గా తీసుకొని మనం సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా తెలుగునాట మంచి విజయం సాధించింది. ఆ వెంటనే సూర్యతో కలిసి సినిమా స్టార్ట్ చేశాడు విక్రమ్ కుమార్. ఇది కూడా ఓ విభిన్నమైన కథాంశమే. ఈ సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ గా తీసుకున్నాడు విక్రమ్ కుమార్. అలా సూర్య-సమంత కాంబినేషన్ లో రెండో సినిమా సిద్ధమైంది. గప్ చుప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పటికే దాదాపు 70శాతం పూర్తయింది. అంతేకాదు.. సినిమాలో తన పోర్షన్ కు సంబంధించి సమంత డబ్బింగ్ కూడా పూర్తిచేసింది. ఆ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనే బ్రేకింగ్ న్యూస్ ను కూడా బయటపెట్టింది. ఈ సినిమాలో సూర్య సరసన సమంతతో పాటు..నిత్యామీనన్ కూడా నటిస్తోంది. సూర్య సరనన నిత్యామీనన్ నటించడం ఇదే ఫస్ట్ టైమ్. సెప్టెంబర్ లో సినిమా పాటల్ని విడుదల చేస్తారు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా పేరు 10-ఎండ్రుదుకుళ్ల.
First Published:  30 July 2015 7:04 PM GMT
Next Story