Telugu Global
Others

స్మార్ట్‌ సిటీలుగా విజయవాడ, విశాఖ, తిరుపతి!

ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌ సిటీల ఎంపికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముందుగా రాజధానికి సమీపాన ఉన్న విజయవాడతోపాటు స్టీల్‌ సిటీ విశాఖపట్నాన్ని, శ్రీనివాసుడు కొలువుతీరిన తిరుపతిని ఎంపిక చేయాలని నిర్ణయించింది. తొలివిడతలో ఏయే నగరాలను ఎంపిక చేయాలన్న అంశంపై ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన నగరాలు, అక్కడి జనాభా, పన్నుల రూపేణా స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్లకు వస్తోన్న ఆదాయం, స్థితిగతులపై ఈ నెల 31 నాటికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి […]

స్మార్ట్‌ సిటీలుగా విజయవాడ, విశాఖ, తిరుపతి!
X
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌ సిటీల ఎంపికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముందుగా రాజధానికి సమీపాన ఉన్న విజయవాడతోపాటు స్టీల్‌ సిటీ విశాఖపట్నాన్ని, శ్రీనివాసుడు కొలువుతీరిన తిరుపతిని ఎంపిక చేయాలని నిర్ణయించింది. తొలివిడతలో ఏయే నగరాలను ఎంపిక చేయాలన్న అంశంపై ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన నగరాలు, అక్కడి జనాభా, పన్నుల రూపేణా స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్లకు వస్తోన్న ఆదాయం, స్థితిగతులపై ఈ నెల 31 నాటికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక తయారు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదిన స్మార్ట్‌ సిటీల జాబితాపై తుది నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కేంద్రం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. పట్టణాభివృద్ధి రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన నిపుణులు, సంస్థలతో ఏర్పాటయ్యే ఓ ప్రత్యేక ప్యానెల్‌ ఈ నగరాలను ఎంపిక చేస్తుంది. ఈ నెలాఖరు నాటికి కేంద్రానికి ప్రతిపాదనలను అందజేయాల్సి ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అత్యున్నత స్థాయి స్టీరింగ్‌ కమిటీతో సమావేశాన్ని తొలిసారి నిర్వహించారు. మొత్తం 13 మున్సిపల్‌ కార్పొరేషన్ల స్థితిగతులపై ఇందులో చర్చించారు. వీటిల్లో విజయవాడతోపాటు విశాఖపట్నం, తిరుపతి నగరాలను ఎంపిక చేశారు. వీటిని ఓ నివేదిక రూపంలో కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబితా అందిన తరువాత కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానెల్‌ జాతీయ స్థాయిలో స్మార్ట్‌ సిటీల కోసం ఎంపిక చేసిన నగరాల జాబితాను ప్రకటిస్తుంది. ఎంపిక చేసిన నగరాలపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ఈ జాబితాను తుది ఆమోదం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) అందజేస్తారు. తొలిదశ జాబితాలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నాన్ని స్మార్ట్‌ సిటీగా మార్చాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుని ఉన్నందున దీంతోపాటు తిరుపతి, విజయవాడలను కూడా ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది.​
First Published:  30 July 2015 1:37 PM GMT
Next Story