Telugu Global
Cinema & Entertainment

మరో అవతారంలోకి మారిన ప్రభుదేవా

ప్రభుదేవా అందరికీ డాన్సర్ గా మాత్రమే తెలుసు. తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాడు. అక్కడ్నుంచి హీరోగా కూడా మారాడు. ఆ తర్వాత ఏకంగా దర్శకుడిగా మారాడు. ఇలా తనలో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయని చూపించిన ప్రభుదేవా, ఇప్పుడు ఏకంగా నిర్మాతగా అవతారమెత్తాడు. అవును.. ప్రభుదేవా ఇప్పుడు ప్రొడ్యూసర్ దేవాగా మారాడు. తన పేరు వచ్చేలా ప్రభుదేవా స్టుడియోస్ అనే కంపెనీ పెట్టాడు. ఈ బ్యానర్ పై ఆగస్ట్ నుంచి సినిమాలు చేస్తానంటున్నాడు. త్వరలోనే ఓ కొత్త సినిమాను ప్రకటిస్తానని […]

మరో అవతారంలోకి మారిన ప్రభుదేవా
X
ప్రభుదేవా అందరికీ డాన్సర్ గా మాత్రమే తెలుసు. తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాడు. అక్కడ్నుంచి హీరోగా కూడా మారాడు. ఆ తర్వాత ఏకంగా దర్శకుడిగా మారాడు. ఇలా తనలో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయని చూపించిన ప్రభుదేవా, ఇప్పుడు ఏకంగా నిర్మాతగా అవతారమెత్తాడు. అవును.. ప్రభుదేవా ఇప్పుడు ప్రొడ్యూసర్ దేవాగా మారాడు. తన పేరు వచ్చేలా ప్రభుదేవా స్టుడియోస్ అనే కంపెనీ పెట్టాడు. ఈ బ్యానర్ పై ఆగస్ట్ నుంచి సినిమాలు చేస్తానంటున్నాడు. త్వరలోనే ఓ కొత్త సినిమాను ప్రకటిస్తానని కూడా చెప్పుకొచ్చాడు. అయితే తన సొంత బ్యానర్ లో తీయబోయే సినిమా హిందీనా, తెలుగా అనే విషయాన్ని మాత్రం ప్రభుదేవా స్పష్టంచేయలేదు. ఏ సినిమా చేసినా అది భారీ బడ్జెట్ మూవీ అయి తీరుతుందని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం అజయ్ దేవగన్ తో హిందీలో ఓ సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నాడు ప్రభుదేవా. డైరక్షన్ బాధ్యతల్ని మాత్రం వేరే వాళ్లకు అప్పగించాలనుకుంటున్నాడు. కేవలం తను ప్రొడ్యూసర్ అండ్ కొరియోగ్రాఫర్ గా మాత్రమే వ్యవహరించాలని భావిస్తున్నాడు.
First Published:  31 July 2015 7:00 PM GMT
Next Story