పవన్ పంచ్ తో మెగా హీరో సినిమా

నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనేది పవన్ కల్యాణ్ మోస్ట్ పాపులర్ డైలాగ్. ఇలాంటి డైలాగుల్ని టైటిల్స్ గా పెట్టి వాడుకోవడంలో టాలీవుడ్ హీరోలకు తిరుగులేదు. అందుకే మరో మెగా హీరో సాయిధర్మతేజ ఆ టైటిల్ వాడేసుకున్నాడు. తన కొత్త సినిమాకు తిక్క అని పేరుపెట్టుకున్నాడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న  ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది. అల్లు అరవింద్ తోపాటు టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కూడా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాతో లారిస్సా అనే మరో భామ తెలుగుతెరకు పరిచయం అవుతోంది. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సాయి ధర్మ తేజ సినిమాకు బాణీలు అందించడం తమన్ కు ఇదే ఫస్ట్ టైమ్. తిక్క అనే టైటిల్ కు ట్యాగ్ లైన్ గా హ్యాండిల్ విత్ కేర్ అని పెట్టారు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ పై రోహిణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తాడు. ప్రస్తుతం సాయి ధర్మ తేజ చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే తిక్క సెట్స్ పైకి వెళ్తుంది. పవన్ గబ్బర్ సింగ్ టైటిల్ వాడుకోవడమే కాదు.. పవన్ కల్యాణే ఇందులో కనిపిస్తాడనే ప్రచారం కూడా అప్పుడే మొదలైంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.