సర్దార్ పేరు కన్ ఫర్మ్

ఇన్నాళ్లూ గబ్బర్ సింగ్-2గా ప్రాచుర్యంలో ఉన్న పవన్ కొత్త ప్రాజెక్ట్ పేరు కన్ ఫర్మ అయింది. మూడు రోజులుగా పరిశ్రమలో చక్కర్లు కొడుతున్న సర్దార్ పేరునే ఫిక్స్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు మేకర్స్. అంతేకాదు.. తమ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. సర్దార్ ఫస్ట్ లుక్ ఇదేనంటూ నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. అంతేకాదు.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పవన్ కల్యాణ్ తయారుచేయడం విశేషం. తనే దగ్గరుండి ఈ పోస్టర్ ను తయారుచేయించాడట పవన్. అప్పట్లో గబ్బర్ సింగ్ టైమ్ లో కూడా ఇదే తరహా పోస్టర్లు విడుదలయ్యాయి. పవన్ కనిపించాడు. తుపాకీ మాత్రమే కనిపిస్తుంది. ఎదురుగా విలన్లు కనిపిస్తారు. సర్దార్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు పవన్. ఇకపై దశలవారీగా తన సినిమా పోస్టర్లు వస్తుంటాయని కూడా స్పష్టంచేశాడు పవన్. ప్రస్తుతం సర్దార్ సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.