Telugu Global
Others

ర్యాగింగ్‌కు మరో విద్యార్ధి బ‌లి

ర్యాగింగ్ భూతానికి జూనియ‌ర్ ఇంట‌ర్ చ‌దువుతున్న మ‌ధువ‌ర్ధ‌న్‌రెడ్డి బ‌ల‌య్యాడు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ క‌ళాశాల‌లో చ‌దువుతున్న మ‌ధు సీనియ‌ర్ల వేధింపులు భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని అత‌ని త‌ల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అనంత‌పురం జిల్లా దొన్నికోట‌వారిప‌ల్లెకు చెందిన కాలువ బ్ర‌హ్మానంద‌రెడ్డి దంప‌తుల కుమారుడు మ‌ధువ‌ర్ధ‌న్‌రెడ్డి. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో వంద‌శాతం మార్కులు సాధించ‌డంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ క‌ళాశాల యాజ‌మాన్యం అత‌డిని త‌మ క‌ళాశాల‌లో చేర్చుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో మ‌ధు టాప‌ర్‌గా నిలిచాడు. అది భ‌రించ‌లేని కొంత‌మంది […]

ర్యాగింగ్‌కు మరో విద్యార్ధి బ‌లి
X
ర్యాగింగ్ భూతానికి జూనియ‌ర్ ఇంట‌ర్ చ‌దువుతున్న మ‌ధువ‌ర్ధ‌న్‌రెడ్డి బ‌ల‌య్యాడు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ క‌ళాశాల‌లో చ‌దువుతున్న మ‌ధు సీనియ‌ర్ల వేధింపులు భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని అత‌ని త‌ల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అనంత‌పురం జిల్లా దొన్నికోట‌వారిప‌ల్లెకు చెందిన కాలువ బ్ర‌హ్మానంద‌రెడ్డి దంప‌తుల కుమారుడు మ‌ధువ‌ర్ధ‌న్‌రెడ్డి. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో వంద‌శాతం మార్కులు సాధించ‌డంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ క‌ళాశాల యాజ‌మాన్యం అత‌డిని త‌మ క‌ళాశాల‌లో చేర్చుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో మ‌ధు టాప‌ర్‌గా నిలిచాడు. అది భ‌రించ‌లేని కొంత‌మంది విద్యార్ధులు మ‌ధుపై సీనియ‌ర్ల‌కు ఫిర్యాదు చేశారు. ఆ రాత్రే సీనియ‌ర్లు మ‌ధుపై దాడి చేసి ర‌క్తం కారేలా కొట్టారు. ఈ విష‌యంపై మ‌ధు క‌ళాశాల ఇన్‌ఛార్జ్‌కు ఫిర్యాదు చేయ‌గా ఇలాంటి విష‌యాలు తేలిక‌గా తీసుకోవాల‌ని సూచించారు. త‌న‌పై దాడి చేసిన విద్యార్ధుల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం అవ‌మానంగా భావించిన మ‌ధు క‌ళాశాల నుంచి అనంతపురంలోని తన ఇంటికి వ‌చ్చేశాడు. తండ్రి బ్ర‌హ్మానంద‌రెడ్డి క్లాస్‌ ఇన్‌చార్జ్‌కి, ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఈనెల 30వ తేదీన ఇన్‌చార్జ్ శ్రీరాములు రెడ్డి మ‌ధు తండ్రికి ఫోన్ చేసి మ‌రోసారి ఇలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌కుండా చూసుకుంటాం పంప‌మ‌ని కోరాడు. అయితే, మీరు మ‌ధుతోనే మాట్లాడండ‌ని ఆయ‌న ఫోన్‌ను మ‌ధుకు ఇచ్చాడు. వారిద్ద‌రూ ఏం మాట్లాడారో తెలియ‌దు కానీ కాలేజ్‌కు వెళతాను… బ‌ట్ట‌లు ఇస్త్రీ చేయించుకొస్తాన‌ని చెప్పి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన‌ మ‌ధు తమకు చెందిన మామిడితోట‌లో ఉరి వేసుకుని క‌నిపించాడ‌ని అత‌ని తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సీనియ‌ర్ల ర్యాగింగ్‌తో రిషికేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకుని కొద్దిరోజులైనా గ‌డ‌వ‌క ముందే మ‌రో విద్యార్ధి ర్యాగింగ్‌కు బ‌ల‌య్యాడు. క‌ళాశాల యాజ‌మాన్యం మాత్రం మ‌ధువ‌ర్ధ‌న్ రెడ్డి త‌మ క‌ళాశాల‌కు ఇక రాన‌ని చెప్పి హాస్ట‌ల్ కూడా ఖాళీ చేసి వెళ్లాడ‌ని, అత‌ని ఆత్మ‌హ‌త్య‌తో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
First Published:  1 Aug 2015 2:12 AM GMT
Next Story